September 15, 2024
News Telangana
Image default
Cinima NewsTelangana

బిగ్ బాస్ నిర్వహకుడు అక్కినేని నాగార్జునను అరెస్టు చేయండి

హైద‌రాబాద్ ( News Telangana ) :-
తెలుగులో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోయిన ఏకైక షో బిగ్ బాస్ ఇప్పటివరకు ఏడు సీజన్ లను పూర్తి చేసుకుంది.. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ 7 టైటిల్‌ గెలుచుకుని విజేతగా నిలిచాడు. అప్పటి వరకు బాగానే ఉంది కానీ ప్రశాంత్, అమర్ లు బయటకు రాగానే వారి ఫ్యాన్స్ రెచ్చిపోయారు.. ప్రశాంత్, అమర్‌దీప్‌, ఇతర ఇంటి సభ్యుల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి. పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్‌దీప్‌, అశ్వినీ కారు అద్దాలను బద్దలు కొట్టడమే కాకుండా..ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. దీనిపై ప్ర‌శాంత్ తో పాటు ప‌లువురిపై కేసులు న‌మోదు చేశారు. ఈ కేసులో ఎ 1 గా ఉన్న ప్ర‌శాంత్ ను అరెస్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అడ్వకేట్‌ అరుణ్‌ కుమార్‌ షోకు హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న నాగార్జున షో, నిర్వాహకులను అరెస్ట్‌ చేయాలని హైకోర్టులో బుధవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.. బిగ్‌బాస్‌ పేరుతో అక్రమంగా 100రోజుల పాటు కంటెస్టెంట్లను నిర్భందించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటీషన్ వేశారు. బిగ్‌బాస్‌ పోటీలో ఉన్నవారిని విచారించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే విషయం పై మహిళా కమిషన్‌ ఛైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని పిటీషనర్‌ అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం వెనకున్న కుట్రను బయటకు తీయాలని ఆయన డిమాండ్‌ చేశారు.. ఈ విధ్వంసానికి కార‌ణ‌మైన బిగ్ బాస్ నిర్వాహ‌కుల‌తో పాటు ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున‌ను అరెస్ట్ చేయాల‌ని త‌న పిటిష‌న్ లో పేర్కొన్నారు.

0Shares

Related posts

తెలంగాణపై తుపాను ఎఫెక్ట్‌ నేడు రేపు భారీ వర్షసూచన

News Telangana

నేను రానుబిడ్డ ..చిలుకూరు దవాఖానకు..!

News Telangana

సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

News Telangana

Leave a Comment