January 17, 2025
News Telangana
Image default
PoliticalTelangana

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

హైదరాబాద్ ( News Telangana ) :-
తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం 42 పేజీలతో విడుదల చేసిన శ్వేతపత్రంలో పలుకీలక విషయాలను ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో మొత్తం అప్పులు రూ.6,71, 757 కోట్లు అని తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్రం అప్పులు రూ.72,658 కోట్లు అని తెలిపింది. పదేళ్లలో సగటున 24.5 శాతం రాష్ట్ర అప్పులు పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రం రుణం రూ.3, 89లక్షల కోట్లు అని తెలిపింది. ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ. 59వేల 414 కోట్లు అని తెలిపింది. కాగ్ నివేదికలోని అంశాలను నివేదికలో పొందుపరిచినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు రుణభారం పెరిగిందని, తెలిపింది. రెవెన్యూ రాబడిలో 34 శాతానికి రుణ చెల్లింపుల భారం పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ రాబడిలో 35 శాతం ఉద్యోగుల జీతాలకు వ్యయం అవుతున్నట్లు స్పష్టం చేసింది. 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉందని పేర్కొం ది.2023-24 నాటికి రుణ, జీఎస్టీపీ 27.8 శాతానికి పెరిగిందని తెలిపింది. బడ్జెట్ కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం ఉన్నట్లు సర్కారు క్లారిటీ ఇచ్చింది. 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98 లక్షల కోట్లు వ్యయం అయినట్లు వెల్లడించింది. ప్రతిరోజూ వేస్ అండ్ మీన్స్ పై ప్రభుత్వం ఆధారపడాల్సిన దుస్థితి ఉందని స్పష్టం చేసింది. 2014లో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందని శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది

0Shares

Related posts

రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి

News Telangana

ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్..

News Telangana

Hyderabad: రాష్ట్రపతి పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

News Telangana

Leave a Comment