July 27, 2024
News Telangana
Image default
AndhrapradeshCrime NewsNationalPoliticalTelangana

అర్టికల్ 370పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

News Telangana :- ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. కేంద్రం నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని ఐదుగురు జడ్డిలు చదువుతున్నారు. ఐదుగురు జడ్జిల్లో ముగ్గురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370పై కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తీర్పును చీఫ్ జస్టీస్ చంద్రచూడ్ చదివి వినిపిస్తున్నారు. భారతదేశంలో కాశ్మీర్ విలీనమై ఉన్నప్పుడు ప్రత్యేక హోదాలేవీ లేవు అని తెలిపారు. కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని వివరించారు. మిగతా రాష్ట్రాలకు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక తేడాలేవీ లేవు అని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీం కోర్టు. రెండు ఉద్దేశాల కోసమే ఆర్టికల్ 370 నాడు ఏర్పటైందని తెలిపింది. అవి కూడా తాత్కాలిక అవసరాలే అని తీర్పులో పేర్కొంది. దేశంలో మిగిలిన రాష్ట్రాలతో జమ్మూ కాశ్మీర్ సమానమని తేల్చింది. కేంద్రం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం రాజ్యాంగబద్దమైనదే అని చెప్పింది. నాటి ప్రత్యేక పరిస్థితులు, యుద్దం కారణంగానే ఆర్టికల్ 370 రూపొందించినట్లు వివరించింది. ఆర్టికల్ రద్దు వెనకాల ఎలాంటి దురుద్దేశం లేదని తేల్చి చెప్పింది. ఇది తాత్కాలిక ఏర్పాటే తప్ప శాశ్వతం కాదని తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని అన్ని హక్కులు జమ్మూ కాశ్మీర్ కు వర్తిస్తాయి. లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి అనుమతిస్తున్నామంటూ సీజేఐ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2024 సెప్టెంబర్ 30లోపు జమ్మూ కాశ్మీర్, లద్ధాఖ్ లలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీనిపై పిటిషనర్లు వేసిన వాదనలన్నింటినీ తోసి పుచ్చింది ధర్మాసనం

0Shares

Related posts

కోదాడ జూనియర్ సివిల్ కోర్టు లో అగ్ని ప్రమాదం..కాలి బూడిదైనా ఫైల్స్

News Telangana

తూప్రాన్ లో కూలిన విమానం

News Telangana

కోదండ రాం, అమీర్ అలీఖాన్ ల ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌

News Telangana

Leave a Comment