హైదరాబాద్ , డిసెంబర్ 11 ( News Telangana ) :-
తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం ఉదయం అసెంబ్లీ సెక్రటేరి యట్ స్పీకర్ ఎన్నిక నోటిఫి కేసన్ కు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 13వ తేదీ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయ కుడు గడ్డం ప్రసాద్ కుమర్ ను,శాసన సభ స్పీకర్‌గా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఒక్కరే నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్ ను స్పీకర్ గా ఎన్నుకోనున్నారు. కిరణ్ కమార్ రెడ్డి మంత్రి వర్గంలో గడ్డం ప్రసాద్ టైక్స్‌టైల్ మంత్రిగా పని చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ వికారాబాద్ నుంచి ఎంఎ ల్‌ఎగా గెలుపొందారు
previous post