- ప్రజా ప్రతినిధులా!ఆధికారులా! అంటూ ఆర్డిఓ ను ప్రశ్నించిన కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్
రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆభయహస్తం ఆరు గ్యారెంటిల అమలుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం 3వ వార్డు లక్ష్మి పురంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య ఆతిదిగా,విశిష్ట ఆతిధిగా పురపాలక సంఘం చైర్ పర్సన్ రామతిర్దపు మాధవి-రాజు,కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ హజరు ఆయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తో కాంగ్రెస్ నాయకులు సాగరం వెంకటస్వామి,చంద్రగిరి,శ్రినివాస్ గౌడ్,కూరగాయల కోమురయ్య లు స్టేజి పైకి ఎక్కి కూర్చొన్నారు. వెంటనే కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ లేచి అధికారులను ఆడుగుతూ వారు ఏమైనా ప్రజా ప్రజాప్రతినిధిలా?ఆధికారులా అంటూ ప్రశ్నించారు.కాగా చైర్ పర్సన్ లేచి ఇది కాంగ్రెస్ సమావేశం ఆయితే మీరు నిర్వహించుకోండి ఆంటూ స్టేజి నుంచి క్రిందికి దిగి వెళ్లారు.ఆప్పుడు కాంగ్రెసు నాయకులు చైర్ పర్సన్ మాధవి-రాజు తో వాగ్వాదానికి దిగారు.ఆర్డీవో జోక్యం చేసుకోని కాంగ్రెసు నాయకులను క్రిందికి దిగిపోవాలని ఆదేశించించటం జరిగింది. దానితో చేసేదేమి లేక కాంగ్రెస్ నాయకులు స్టేజి దిగి స్టేజి ముందున్నా కుర్చీల్లో కుర్చున్నారు. దిగిపోయిన తర్వాత కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ కార్యక్రమాన్ని కొనసాగించారు.