July 26, 2024
News Telangana
Image default
Telangana

పోతుగల్ లో గొర్ల మందపై కుక్కల దాడి

  • శూనకాల పై చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు
  • 2లక్షల నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యుల ఆవేదన

న్యూస్ తెలంగాణ :- ముస్తాబాద్ మండలంలో గొర్ల మందపై తెల్లవారుజామున కుక్కలు దాడి చేయగా పది గోర్లు మృత్యువాత పడ్డాయి స్థానికులు తెలిపిన వివరాలు వివరాలు ఇలా ఉన్నాయి ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన గంగ సాయిలు అనే గొర్ల కాపరి ఇంటి ముందున్న మందపై తెల్లవారుజామున ఇంటి యజమాని లేచి చూసేసరికి మందపై శూనకాలు దాడి చేయగా దాడిలో 10 గోర్లు మృత్యు వాత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. గ్రామాలల్లో శూనకాలు స్వైర విహారం చేస్తున్న గ్రామ పంచాయితీ లు , సంబంధిత అధికారులు పట్టించుకోక వడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ముచ్చటలాడారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామాల లో శూనకాల ను నిర్ములించే బాధ్యత స్పష్టంగా ఉన్నదని గ్రామస్తులు ప్రశ్నినిస్తున్నారు. కటిక పేద కుటుంబంలో జీవిస్తున్న కుటుంబ సభ్యులు గొర్లె జీవనోపాధిగా జీవనం కొనసాగిస్తున్నారని ఇలా అకస్మాత్తుగా శూనకాలు దాడి చేయగా 2 లక్షల రూపాయల నష్టపరిహారం వాటిల్లడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని కన్నీరు మున్నిరయ్యారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి స్వైర విహారం చేస్తున్న శూనకాలను ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. అదేవిధంగా బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0Shares

Related posts

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్‌రావు

News Telangana

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

News Telangana

న్యూస్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన కేటీఆర్

News Telangana

Leave a Comment