News Telangana :- తెలంగాణలో రైతులందరికీ పెట్టుబడి సాయం నిధులను వారి ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధికా రులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం సచివాల యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖా మం త్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి,తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు, సిఎంఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవ సాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితర అధికారులు హాజర య్యారు. దాదాపు మూడు గంటల పాటుజరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ,సంబం ధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్బంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు నేటి నుండే రైతు బంధు నిధులను సంబంధిత రైతుల ఖాతాల్లో వేసే ప్రక్రిను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టు బడి సహాయం అందిం చాలని అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం లోని రైతులకు రెండు లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకు తగు కార్యా చరణ ప్రణాళికను రూపొం దించాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతా ధికారులను ఆదేశించారు.
- ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి
ప్రస్తుతం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో నిర్వహి స్తున్న ప్రజా దర్బార్ ను ఇకనుండి ప్రజావాణిగా పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ ప్రజావాణి ని ఇకనుండి ప్రతి మంగళ, శుక్ర వారాల్లో రెం డు రో జులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటల లోపు జ్యోతి రావు పూలే ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఇ వ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు చేయాలని, ప్రజల సౌక ర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు