June 21, 2024
News Telangana
Image default
Telangana

జీరో ఇసుక దందాకు కేరాఫ్ రామానుజవరం…!

  • అక్రమ పాసులు.. మంది మార్బలంతో దర్జాగా వ్యాపారం..?
  • నిఘా నిద్రపోతోంది… దగా దండిగా దండు కొంటోంది..?
  • నిబంధనలకు పాతర.. మాఫియా జాతర…?
  • నిత్యం లారీల ద్వారా ఇసుక అక్రమ రవాణా..?
  • పట్టించుకోని మైనింగ్ రెవెన్యూ రవాణా శాఖ అధికారులు…?
  • కమిషన్ల కక్కుర్తే.. జీరో దందాకు… రాజమార్గమా…?
  • రామానుజ వరంలో… డేగల మాదిరిగా తోడేస్తున్నారా…?
  • ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న గానీ.. లారీకి 3500 సమర్పించుకోవాల్సిందేనా…?
  • ఇక్కడ ఇంతే.. పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి తప్పదా…?
  • న్యూస్ తెలంగాణ పరిశీలనలో వెలుగు చూస్తున్న అక్రమాలపర్వం…?


న్యూస్ తెలంగాణ ప్రత్యేక కథనం : ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో, మే 25 (న్యూస్ తెలంగాణ) :-


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని రామానుజ వరం ర్యాంపు అక్రమార్కులకు వరంగా మారిందని పలువురు జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఈ రాంపు నుండి వందలాది లారీలు నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో పాటు ఎటువంటి అనుమతులు లేని జీరో ఇసుకను లోడ్ చేసుకొని భద్రాచలం కొత్తగూడెం పాల్వంచ ఖమ్మం తదితర ప్రాంతాలకు తరలిస్తూ నిత్యం లక్షలాది రూపాయలు మేర ఇసుక మాఫియా ముఠా ఆర్జిస్తున్న గాని సంబంధిత అధికారులకు చలనం లేదని జిల్లా వాసులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇసుక బుకింగ్ కోసం ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసినప్పటికీ రామానుజవరం ర్యాంపు దగ్గర ఏర్పాటు చేసిన కౌంటర్ నందు ఒక్కొక్క లారీ కి అక్షరాల 3500 రూపాయలు ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తోందని లారీ డ్రైవర్లు సైతం ఆరోపిస్తున్నారు. కాగా న్యూస్ తెలంగాణ పరిశీలనలో అనేక సంచలనాత్మక విషయాలు వెలుగు చూశాయి. అనుమతులు పొందిన చోట కాకుండా మరోచోట నుండి జీరో ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో వాస్తవమేనని ఆధారాలతో సహా సేకరించడం విశేషం. ఎటువంటి అనుమతులు లేని ఇసుకను పాల్వంచ చెక్ పోస్ట్ మీదుగా నిత్యం తరలిస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగంగా రామనుజవరంలో బరితెగించి మరి ఇసుకను తోడేస్తున్న గాని సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఒక్కొక్క లారీకి 3500 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న సంబంధిత రెవెన్యూ మైనింగ్ రవాణా శాఖ అధికారులు మాత్రం పట్టినట్లుగా వ్యవహరించడం వెనుక నెలవారి కమీషన్ల వ్యవహారం వలన సంబంధిత అధికారులు ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపించడం విశేషం.
*రామానుజవరంలో నిబంధనలు.. ఉంటే కదా పట్టించుకునేది…?
కాగా రామానుజవరం ఇసుక ర్యాంపులో అక్రమ వసూళ్లతో పాటు మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడేస్తున్న సంబంధిత రెవెన్యూ మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధన ప్రకారం తవ్వకాలు జరపాల్సి ఉండగా సదరు నిర్వాహకులు ఇష్టానుసారంగా పెద్దపెద్ద గోతులు పెట్టి అనుమతులు లేని జీరో ఇసుకను దర్జాగా తరలిస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్న ప్రభుత్వ ఖజానానకు గండి కొడుతున్న సంబంధిత అధికారులు అసలు పట్టించుకోకపోవడం ముమ్మాటికినెలవారీ మామూళ్ల మత్తెనని నియోజకవర్గ ప్రజలు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ఒక్కొక్క లారీ ఇసుకను సంబంధిత ఇసుక మాఫియా వ్యాపారులు 90 వేల నుండి లక్ష రూపాయల వరకు జోరుగా అమ్మకాలు చేస్తూ లక్షల రూపాయలు సంబంధిత అధికారులతో చలనం లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ మైనింగ్ రవాణా శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి జిల్లా సరిహద్దులు దాటిపోతున్న అక్రమ ఇసుకను అడ్డుకొని ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్న నిర్వాహకులపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకొని ప్రభుత్వ ఖజానాను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పలువురు నియోజకవర్గ ప్రజలు జిల్లా వాసులు జిల్లా ఉన్నతాధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
( వేచి చూడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 2లో)

0Shares

Related posts

నో చెకింగ్ .. ఓన్లీ మనీ “చెక్ పోస్ట్”

News Telangana

బీఎస్పీ పార్టీకి అవకాశం ఇవ్వండి

News Telangana

తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు

News Telangana

Leave a Comment