June 21, 2024
News Telangana
Image default
Telangana

మట్టి మాఫీయా కి అడ్డుకట్ట పడేనా …?

కొండలని పిండి చేసి కోట్లుఘటిస్తూ ప్రభుత్వానికి అధికారులకు అడ్డ సూటిగా వెళ్తున్న ఈ అక్రమ మట్టి మాఫియా డాన్ కు అడ్డుకట్ట పడేనా …?

  • ఎంత సన్నిహితులైతే మాత్రం… ఇదేం మట్టి దందా..?
  • మంది మార్బలంతో… గుట్టలు పిండి చేస్తున్న… మౌనం వీడేది ఎన్నడు…?
  • మట్టి మాఫియా దందా ఖమ్మం సమీపంలో ఇలా ఉంటే… మరి తెలంగాణలో…?
  • రఘునాధపాలెం మట్టి మాఫియాకు అడ్డుకట్టపడేనా…?
  • ప్రైవేటు సైన్యం పాహారలో… అక్రమ మట్టి రవాణా…?
  • చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు..?


న్యూస్ తెలంగాణ ప్రత్యేక కథనం : ఉమ్మడి ఖమ్మం బ్యూరో / జూన్ 7 :-
ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని రఘునాధపాలెం మండలంలో పువ్వాడ ఉదయ్ కుమార్ నగర్లో మట్టి మాఫియా నిత్యం రెచ్చిపోతూ బహిరంగంగా మట్టి అక్రమ రవాణా చేస్తూ అధికార పార్టీకి చెందిన నేత పేరును వాడుకుంటూ దర్జాగా ప్రజాధనాన్ని కాజేస్తున్న చేస్తున్నా గానీ సంబంధిత అధికారులకు చీమకుట్టినట్లు కూడా ఉండకపోవటం సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయల మట్టిని రాత్రి పగలు అనే తేడా లేకుండా అధికార అండదండలతో దర్జాగా తరలించడం పై జిల్లావ్యాప్తంగా పలు విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత సన్నిహితులు అయితే మాత్రం మరి ఇంత తెగింపు ఎక్కడి నుండి వచ్చిందని స్థానిక ప్రజలు బహిరంగంగా ఆరోపించడం తెలిసిందే. జిల్లా స్థాయిలో ఆ నేతకు పరపతి పలుకుబడి ఉండటం వాహనాలపై కూడా సదరు నేత పేరుతోనేబొమ్మలతో మాఫియా దారుల వాహనాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. న్యూస్ తెలంగాణ గత కొన్ని రోజులుగా మట్టి మాఫియా లీలలపై అక్రమ తరలింపు పై వరుస కథనాలు ప్రశ్నిస్తూ సంచలనం కలిగిస్తున్న గాని అధికారులు పట్టించుకోకపోవడం రాజకీయ అండదండలతో పాటు చేతులు మారిన లక్షలాది రూపాయలు ప్రధాన కారణమని విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. భారీ పోక్లేన్ల తో నిరంతరం టిప్పర్లు ట్రాక్టర్లతో తరలిస్తున్న గాని సంబంధిత రెవెన్యూ మైనింగ్ రవాణా శాఖ అధికారులు తీసుకునేందుకు భయపడుతున్నారని ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. నిత్యం అక్రమ మట్టి దందా ద్వారా ముఠా సభ్యులు పండుగ చేసుకుంటున్నారని సదరు మాఫియా ముఠా ఇచ్చే కమిషన్లపై అధికారులు ఆరా తీయడం తప్ప అడ్డుకున్న పాపాన పోవటం లేదని పలువురు స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్ర అవస్థను వీడి అక్రమ మట్టి మాఫియా పై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకొని ప్రభుత్వ ఖజానాను కాపాడాలని పలువురు జిల్లా ప్రజలు స్థానికులు వేడుకుంటున్నారు.

0Shares

Related posts

నో చెకింగ్ .. ఓన్లీ మనీ “చెక్ పోస్ట్”

News Telangana

గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

News Telangana

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తోంది.. వారంతా ఇప్పటికైనా మారాలి.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

News Telangana

Leave a Comment