October 2, 2024
News Telangana
Image default
Telangana

పెద్దపల్లి డస్ట్ రవాణాపై న్యూస్ తెలంగాణ కథనాలకు భారీ స్పందన…!

  • రవాణా శాఖ అధికారుల తీరే సపరేటు..?
  • మాది కాదంటే… మాది కాదు..?
  • రామగుండం నుండే రాకుండా ఉంటే.. ఈ గోల ఉండదుగా.. అంటున్న రవాణా శాఖ అధికారులు…?
  • 60 టన్నుల నుండి 70 టన్నుల దాకా రవాణా..?
  • న్యూస్ తెలంగాణ చేతికి చిక్కిన ఆధారాలు ఎన్నో…?
  • అధికార, ప్రతిపక్షాల మధ్య పేలుతున్న మాటల తూటాలు..?
  • రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ ఆరోపణ..!
  • మంత్రి ఆదేశాలతోనే 100 కోట్ల స్కాం…?


(న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో) ప్రత్యేక కథనం :-
పరిమితికి మించి అక్రమంగా ప్రభుత్వ నిబంధనలను బహిరంగంగా తుంగలో తొక్కుతూ పెద్దపల్లి జిల్లా అధికారులు పెద్దపల్లి నుండి కరీంనగర్ వరంగల్ మీదుగా ఖమ్మం వైరా సత్తుపల్లి తదితర ప్రాంతాలకు నిత్యం వందలాది లారీలతో డస్ట్ వాహనాలు బహిరంగంగా రవాణా చేస్తున్న గాని అధికారులు పట్టించుకోకపోవడంపై న్యూస్ తెలంగాణ తెలుగు దినపత్రిక గత ఏప్రిల్ 18 న మామూళ్ల మత్తులో రవాణా శాఖ అధికారులు.. అను శీర్షికన ప్రధాన వార్తగా మరియు మే 27 కమిషన్ల కక్కుర్తే అధికలోడుతో వెళుతున్న డస్ట్ వాహనాలకి రాజమార్గమా..? అను వార్తా కథనం వెలువడిన సంగతి తెలంగాణ ప్రజానీకానికి తెలిసిందే. హైవే రోడ్ల పేరుతో నిబంధనలను పట్టించుకోకుండా అధిక లోడుతో వాహనాలను నిత్యం నడుస్తున్న సంబంధిత రవాణా శాఖ అధికారులు మాత్రం చూస్తూ ఉండిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో మంత్రి ప్రోత్సాహంతోనే ఈ వ్యవహారం అంతా నడిచినట్లు పెద్దపల్లి, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ప్రతిపక్ష ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా 100 కోట్లు రూపాయల మేర అవినీతి జరిగిందని ఈ వ్యవహారానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మంత్రివర్గం నుండి బర్తరప్ చేయాలని పత్రికా ముఖంగా ఆరోపణలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూస్ తెలంగాణ వార్త కథనాలకు విశేష స్పందన వచ్చింది. నాడు ఆధారాలతో సహా నిబంధనలు పట్టించుకోని రవాణా శాఖ అధికారులపై వార్తా కథనాలు ప్రచురించిన స్టేట్ బ్యూరో ప్రతినిధిపై కూడా కవ్వింపులకు బెదిరింపులకు పలుమార్లు దిగిన సందర్భాలు ఉన్నాయి. పరిమితికి మించి లారీల ప్రయాణంతో కొన్ని కొన్ని జిల్లాలలో రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసం అయినట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. కాకా డస్ట్ వాహనాల అక్రమ రవాణాపై రామగుండం నుండి రాకుండా ఉంటే ఇక్కడ సమస్య ఉండదుగా అని కరీంనగర్ వరంగల్ ఖమ్మం రవాణా శాఖ అధికారులు వివరణ ఇవ్వడం ఓ అధికారి మాత్రం ఒక అడుగు ముందుకేసి కేసులు రాసిన గాని యధావిధిగా రవాణా చేస్తున్నారు. రాష్ట్రస్థాయి నుండి ఒత్తిళ్ళ మేరకు పనిచేయాల్సి ఉంటుందని బహిరంగంగా ప్రతినిదికి తెలపడం విస్మయం కలిగిస్తుంది. అసలు మొదలు పెద్దపల్లి జిల్లా రామగుండంలో నియంత్రిస్తే పెద్దపల్లి కరీంనగర్ వరంగల్ ఖమ్మం దాకా వచ్చేవి కావుగా అని రవాణా శాఖ అధికారులు న్యూస్ తెలంగాణ ప్రతినిధితో వ్యాఖ్యానించటం ఈ దందాకు ఉన్న పలుకుబడి పరపతి ఇట్టే అర్థం చేసుకోవచ్చని సామాన్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పలుకుబడి పరపతి వలన సుమారు 60 టన్నుల నుండి 70 టన్నుల వరకు కూడా లోడ్ రవాణా చేస్తున్న వ్యవహారంపై న్యూస్ తెలంగాణ సమగ్ర పరిశీలన చేయగా ఒక్కొక్క లారీ 70 టన్నుల వరకు రవాణా చేస్తున్నట్లు రసీదులు ప్రభుత్వ నిబంధనలకు మూడు రె ట్లు అధికంగా బరువుతో ప్రయాణించటం కొస మెరుపు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి అక్రమంగా తరలిస్తున్న డస్ట్ లారీల వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

0Shares

Related posts

శాసనసభ స్పీకర్ కు నోటిఫికేషన్ ఉత్తీర్ణులు జారీ

News Telangana

శబరిమలై పాదయాత్ర నుండి క్షేమంగా ఇంటికి చేరిన అయ్యప్ప స్వాములు

News Telangana

కనిపించని ఫుడ్ సేఫ్టీ అధికారులు

News Telangana

Leave a Comment