July 26, 2024
News Telangana
Image default
Telangana

పాల్వంచ చెక్ పోస్ట్ లో అక్రమ వసూళ్లు..!

  • వసూళ్ల పర్వంలో చెక్ పోస్ట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆఫీసర్స్
  • భారీగా చేతి వాటం చూపిస్తున్న చెకపోస్ట్ సిబ్బంది
  • కాసుల కోసమే రాబందుల ఎదురుచూస్తున్న సిబ్బంది
  • చెకపోస్ట్ వారు పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే కొర్రీలే
  • జిల్లా అధికారుల పర్యవేక్షణ కరువు తూతూ మంత్రంగా తనిఖీలు
  • చెకపోస్ట్ పేరిట భారీగా దందా
  • ఇదంతా జిల్లా అధికారికి తెలవదా అంటున్న బాధిత డ్రైవర్లు ?

( చెక్ పోస్ట్ ల “వసూళ్లు” పూర్తి అధకారాలతో ” న్యూస్ తెలంగాణ” లో వరుస సంచలనాత్మక కథనాలు )

స్టేట్ బ్యూరో / న్యూస్ తెలంగాణ :- భారీగా చేతి వాటం చూపిస్తున్న చెకపోస్ట్ సిబ్బంది చెకపోస్ట్ వారు పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే కొర్రీలే. చెకపోస్ట్ పేరిట భారీగా దందా చేస్తున్నప్పటికి ఇదంతా జిల్లా అధికారికి తెలవదా? నామ మాత్రం కె తనిఖీలు అనేది వట్టి మాట అసలు మా దగ్గర తనిఖీలే ఉండవు. నా చెక్ పోస్ట్ కి నేనే రాజు నా రూల్స్ నా ఇష్టం నేను ఎంత చెబితే అంత ఇవ్వాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆర్టిఏ అధికారులు. ఏ ఒక్క ఆర్టిఏ సిబ్బంది కూడా వెళ్లి నేరుగా లారీని ఆపి లేదా చిన్న వాహనాలని పిండి కొద్ది రోటి అన్నట్లుగా రేట్ ఫిక్స్ చేసి పెట్టారు లారికి అయితే 300 నుంచి 1000 రూపాయలు చిన్న వాహనాలకి 200 నుంచి 500 వరకు వసూళ్లు చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సైతం వదలని ఆర్టిఏ సిబ్బంది వాహనంలో ఏమున్నదో పక్కన పెడితే కనీసానికి వాహనానికి పేపర్స్ ఉన్నవా ..? లేవా..? అని సైతం చెక్ చేయడానికి సిబ్బందికి తీరికలేదు. అక్రమ వసులతోనే టైం సరిపోతుంది అక్కడ ఆర్టిఏ కి ఇచ్చే లంచం కాకుండా కానిస్టేబుల్స్ సైతం ఆ లారీ డ్రైవర్లని పిడుస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ బాధిత లారీ డ్రైవర్లు వాపోతున్నారు ఇలా చూసుకున్నట్లయితే వాహనాల్లో చెక్ చేయడానికి మరి వాహనంలో ఏమున్నది ఏమొస్తుంది అని ఎవరు చెక్ చేయాలి. ఇలా అసమర్థత డిపార్ట్మెంట్ మరి అవసరమా లక్షల రూపాయల జీతాలు అవి చాలక రోజుకు ఒక్కో అధికారికి ఒక్కో బ్యాగు గవర్నమెంట్ సొమ్ముకి చిల్లు పెడుతున్న ఆర్టిఏ అధికారులు. మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం. రీజనల్ ట్రాన్స్ఫోర్ట్ ఆఫీసర్ (DTO) కనుసనల్లో జరుగుతున్నట్లు సమాచారం. వీరికింత వారికంత అన్నట్లుగా వ్యవహారం. అంతేకాకుండా ఆర్టిఏ అధికారులు పర్సనల్గా ఒక గుమస్తాని సైతం ఏర్పరచుకున్నారు ఈ అమ్యామ్యాల యవ్వారం చూడడానికి అని విశ్వసనీయ సమాచారం.

(తరువాయి భాగం వేచి చూడండి త్వరలో న్యూస్ తెలంగాణ )

0Shares

Related posts

చెక్ పోస్ట్ లో అక్రమ వసూళ్లు… అక్కడ అంతా ” మనీ “

News Telangana

నో చెకింగ్ .. ఓన్లీ మనీ “చెక్ పోస్ట్”

News Telangana

రేవంత్ రెడ్డి పెళ్లి వెనుక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ

News Telangana

Leave a Comment