June 21, 2024
News Telangana
Image default
Telangana

నో చెకింగ్ .. ఓన్లీ మనీ “చెక్ పోస్ట్”

 • శ్రీ రామదాసు సినిమా లో ఐసు గడ్డ ని తలపిస్తున్న నల్లగొండ జిల్లా వాడేపల్లి చెక్ పోస్ట్ వసుళ్ళ పర్వం
 • అక్రమ వసుల్లె ద్యేయంగా పనిచేస్తున్న నల్గొండ వాడేపల్లి చెకపోస్ట్ అధికారులు.
 • చెకపోస్ట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆఫీసర్స్
  భారీగా చేతి వాటం చూపిస్తున్న చెకపోస్ట్ సిబ్బంది.
 • చెకపోస్ట్ వారు పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే కొర్రీలే
 • జిల్లా అధికారుల పర్యవేక్షణ కరువు తూతూ మంత్రంగా తనిఖీలు…
 • చెకపోస్ట్ పేరిట భారీగా దందా చేస్తున్నప్పటికి ఇదంతా జిల్లా అధికారికి తెలవదా ? స్టేట్ బ్యూరో జనవరి 27 (న్యూస్ తెలంగాణ)
  భారీగా చేతి వాటం చూపిస్తున్న చెకపోస్ట్ సిబ్బంది.
  చెకపోస్ట్ వారు పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే కొర్రీలే. చెకపోస్ట్ పేరిట భారీగా దందా చేస్తున్నప్పటికి ఇదంతా జిల్లా అధికారికి తెలవదా?
  నామ మాత్రం కె తనిఖీలు అనేది వట్టి మాట అసలు మా దగ్గర తనిఖీలే ఉండవు. నా చెక్ పోస్ట్ కి నేనే రాజు నా రూల్స్ నా ఇష్టం నేను ఎంత చెబితే అంత ఇవ్వాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆర్టిఏ అధికారులు. ఏ ఒక్క ఆర్టిఏ సిబ్బంది కూడా వెళ్లి నేరుగా లారీని ఆపి లేదా చిన్న వాహనాలని పిండి కొద్ది రోటి అన్నట్లుగా రేట్ ఫిక్స్ చేసి పెట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సైతం వదలని ఆర్టిఏ సిబ్బంది వాహనంలో ఏమున్నదో పక్కన పెడితే కనీసానికి వాహనానికి పేపర్స్ ఉన్నవా లేవా అని సైతం చెక్ చేయడానికి సిబ్బందికి తీరికలేదు. అక్రమ వసులతోనే టైం సరిపోతుంది
  ఇలా చూసుకున్నట్లయితే వాహనాల్లో చెక్ చేయడానికి మరి వాహనంలో ఏమున్నది ఏమొస్తుంది అని ఎవరు చెక్ చేయాలి. ఇలా అసమర్థత డిపార్ట్మెంట్ మరి అవసరమా లక్షల రూపాయల జీతాలు అవి చాలక రోజుకు ఒక్కో అధికారికి ఒక్కో బ్యాగు గవర్నమెంట్ సొమ్ముకి చిల్లు పెడుతున్న ఆర్టిఏ అధికారులు. మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం. రీజనల్ ట్రాన్స్ఫోర్ట్ ఆఫీసర్ (RTO) కనుసనల్లో జరుగుతున్నట్లు సమాచారం. వీరికింత వారికంత అన్నట్లుగా వ్యవహారం. అంతేకాకుండా ఆర్టిఏ అధికారులు పర్సనల్గా ఒక గుమస్తాని సైతం ఏర్పరచుకున్నారు ఈ అమ్యామ్యాల యవ్వారం చూడడానికి అని విశ్వసనీయ సమాచారం. (తరువాయి వేచి చూడండి త్వరలో న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 2 లో )
0Shares

Related posts

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా

News Telangana

పురుగుల మందు తాగి యువకుడు మృతి

News Telangana

అవునూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు డబ్బులు పంచుతూ పట్టివేత

News Telangana

Leave a Comment