October 5, 2024
News Telangana
Image default
PoliticalTelangana

సీఎం రేవంత్‌తో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ భేటీ

హైదరాబాద్‌, డిసెంబర్ 17 ( న్యూస్ తెలంగాణ ) :-
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవ ర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆదివారం భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సల హాదారుగా కూడా పని చేసిన ఆయన ముఖ్య మంత్రితో తన అనుభవాలు పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరి స్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూ హాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేం దుకు పలుసూచనలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్య మంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్ర మార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వాలు దివాలా తేసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దని, ఉంటే నిరుపేద లకు ఉపయోగపడే ఉచి తాలు సమర్థనీ యమేనని రెండు రోజుల క్రితం రాఘు రామ్‌ రాజ్‌ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ఇస్తున్నాయని, అది సరికాదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

0Shares

Related posts

NIA మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో తెలంగాణ యువకులు

News Telangana

తెలంగాణ రైతులందరికీ నేటి నుండి పెట్టుబడి సహాయం: సీఎం రేవంత్ రెడ్డి

News Telangana

వసూళ్ల కు అడ్డా … వాంకిడి చెక్ పోస్ట్

News Telangana

Leave a Comment