September 13, 2024
News Telangana
Image default
PoliticalTelangana

కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్

హైదరాబాద్ ( న్యూస్ తెలంగాణ ) : తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో గత 50 ఏళ్ల పాలనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు. ‘55 ఏళ్లు ఏం చేశారని మమ్మల్ని అంటున్నారు. అది బాగాలేదనే తెలంగాణ తెచ్చుకున్నాం. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టాము. ఐదు లక్షల కోట్లతో రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చారు. సంపదతో కూడిన తెలంగాణను విధ్వంసం చేశారు’’ అంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే

‘‘పదేళ్లు విధ్వంసం జరిగింది అంటున్నారు. మరి 50 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడొద్దా. తాగునీరు సాగునీరు విద్యుత్ ఇవ్వలేని అసమర్థులు. మొదటి రోజే ఇంత భయపడితే ఎలా. మూడు నెలలు సమయమిస్తే కచ్చితంగా అట్టర్ ప్లాప్ అవుతుంది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతలది’’ అంటూ కేటీఆర్‌ విరుచుకుపడ్డారు.

  • హాట్‌ హాట్‌గా అసెంబ్లీ

కేటీఆర్‌‌ను ఎన్‌ఆర్‌ఐ అంటూ రేవంత్ సెటైర్ తో తెలంగాణ అసెంబ్లీ హాట్‌ హాట్‌గా నడుస్తోంది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా తప్పులతడకే అని.. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే తెలంగాణ పక్షమే.. కాంగ్రెస్ ఎప్పటికీ విపక్షమే అన్న కేటీఆర్ కామెంట్స్‌పై రేవంత్ మండిపడ్డారు. కేటీఆర్‌ను ఎన్‌ఆర్‌ఐ అంటూ సెటైర్ విసిరారు. కొంతమంది ఎన్ఆర్ఐ‌లకు ప్రజాస్వామ్యం గురించి చెప్పినా అర్థం కాదన్నారు. అచ్చోసిన ఆంబోతులా పోడియంకు వస్తాం అంటే సరికాదన్నారు. పోతిరెడ్డిపాడుకు పొక్క పెట్టినరోజు మాట్లాడిన నాయకుడు పీజేఆర్ తమ నేత అని చెప్పుకొచ్చారు. చీమలు పెట్టిన పుట్టలో జోర్రినట్టు కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చారని వ్యాఖ్యలు చేశారు. కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేశారన్నారు. గత పాలన గూర్చి మాట్లదుడామంటే ఒక రోజంతా చర్చ పెడదామన్నారు. గత పాలనలో పాపం ఉందంటే ఆనాటి పాలకుల్లో చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్‌లోనే ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌కు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తుచేశారు. కేసీఆర్‌కు సింగిల్ విండో ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవన్నారు. ప్రతి పక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు

0Shares

Related posts

బరి తెగిస్తూ కొత్త రకంలో ఇసుక దందాకు పాల్పడుతున్న భూ బకాసురులు

News Telangana

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్‌రావు

News Telangana

ముస్తాబాద్ లో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

News Telangana

Leave a Comment