September 8, 2024
News Telangana
Image default
Telangana

వేములవాడ రాజన్న గర్భగుడిలో ఆర్జిత సేవలు నిలిపివేత

News Telangana :- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరాజరా జేశ్వ రస్వామి ఆలయ అధికా రులు భక్తులకు అలర్ట్ జారీ చేశారు. గర్భ గుడిలో నేడు,రేపు ఆర్జిత సేవలను తాత్కా లికంగా నిలిపేస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్‌ వెల్ల డించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24, వరకు మేడారం సమ్మ క్క,సారలమ్మ మహాజాతర కొనసాగనుంది. ఈ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ.ఈ నేపథ్యం లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జాతర పూర్త య్యేంత వరకు ఆది,సోమ వారాల్లో ఆర్జిత సేవలను నిలిపేస్తున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. శుక్ర, శనివారాల్లో సమ్మక్క సారలమ్మ భక్తుల తాకిడి తక్కువగా ఉంటే మిగిలిన భక్తులకు గర్భగుడిలో అభిషేకం, అన్నపూజల మొక్కులు చెల్లించుకు నేందుకు టికెట్లు జారీ చేస్తామని తెలిపారు. మిగిలిన రోజుల్లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు. ఆర్జిత సేవల వివరాలు దేవస్థానం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఈవో వెల్లడించారు. భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి ఆలయంలో బేడా మండపం వద్ద అధ్యయనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శనివారం నరసింహ అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారు ఇవాళ వామ నావతారంలో దర్శన మివ్వ నున్నారు. ధనుర్మాసం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. సుప్రభాతం,ఆరాధన, అభిషేకం, తిరుప్పావై సేవాకాలం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు

0Shares

Related posts

గద్దర్ విగ్రహం ఏర్పాటుకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్

News Telangana

పాల్వంచ చెక్ పోస్ట్ లో అక్రమ వసూళ్లు..!

News Telangana

రెండు నెలల పాలనలో.. అభివృద్ధి శూన్యం

News Telangana

Leave a Comment