November 19, 2024
News Telangana
Image default
Telangana

💥రేషన్ కార్డులు ఉన్న వారికి సర్కార్ శుభవార్త

హైదరాబాద్ ( News Telangana ) :-రేషన్ కార్డులు ఉన్న వారికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.2026 మార్చి 31 వరకు ఇది కొనసాగుతుందని ప్రకటించింది. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులుకు ప్రతి నెలా కేజీ చెక్కెరను సబ్సిడీ కింద ప్రభుత్వం అందిస్తోంది. అయితే, చెక్కెర సేకరణ, పంపిణీ బాధ్యతలను ఆయా రాష్ట్రాలు చూసుకుంటున్నాయి. అయితే ఈ ప్రయోజనం కొంత మందికే వర్తిస్తుండటం గమనార్హం. దేశ వ్యాప్తంగా ఈ సబ్సిడీ పథకం దాదాపు 1.89 కోట్ల ఏఏవై కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

కాగా, కేంద్రం ఇప్పటికే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ ఇస్తోంది. దీని ద్వారా రేషన్ కార్డు కలిగిన వారికి ప్రతి నెలా ఉచితంగానే కేంద్రం నుంచి బియ్యం లభిస్తుంది. దీనిని వల్ల సబ్సిడీ రేటుతో కూడిన పప్పు, గోధుమలు, చక్కెర లభించడం వల్ల భారతదేశంలోని ప్రజలు అందుబాటు ధరకే ఆహారం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. అందరికీ ఆహారం అందరికీ పోషకాహారం లక్ష్యం దిశగా మోడీ ప్రభుత్వం పయనిస్తోందని మంత్రులు చెబుతున్నారు.

0Shares

Related posts

ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

News Telangana

జేపీ గ్రూప్స్ అధినేత పాష చేతికి జై తెలంగాణ దినపత్రిక

News Telangana

రాజీనామా చేసిన కేసీఆర్

News Telangana

Leave a Comment