January 24, 2025
News Telangana
Image default
Telangana

గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పోలీసులు

హైదరాబాద్ ( News Telangana ) :
మేడ్చల్ మల్కాజ్ గిరిలోని బాచుపల్లి లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రా పోలీసులు పట్టుబడ్డారు.

బాచుపల్లి లో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఒటి బాలానగర్ పోలీసులు సమాచారం తెలిసింది.

వెంటనే అనుమానంతో ఎపి 39 క్యూహెచ్ 1763 మారుతీ సిఇఒ వాహనాన్ని పోలీసులు పట్టుకుని పరిశీలించగా 22 కేజీల గంజాయి, 11 పాకెట్స్ లో లభించాయి.

ఈ గంజాయి విలువ రూ.8 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడలోని మూడో బెటాలియన్ ఎపిఎస్ పి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అని తెలిసింది.

వీరు గంజాయి స్మగ్లింగ్ లో పెద్ద మొత్తం లో డబ్బు సంపాదించవచ్చు అనే ఆశ తో ఆరోగ్యం బాగాలేదు అనే సాకుతో సెలవు పెట్టి మొదటి సారిగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటం జరిగింది. బాచుపల్లీ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతుంది.

0Shares

Related posts

సాయి మారుతి నగర్ కాలనీలో దేవాలయ నిధుల దుర్వినియోగం

News Telangana

మద్దూరులో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

News Telangana

నేడు మేడారం జాతర పై మంత్రి సీతక్క సమావేశం

News Telangana

Leave a Comment