ఎండపల్లి, ఫిబ్రవరి 12 (న్యూస్ తెలంగాణ):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బోగ లచ్చయ్య (55) ఆదివారం రోజున మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో అతని ఆటోను బస్టాండ్ వద్ద నిలిపి ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై వస్తున్న కారు అతివేగంగా దూసుకు వచ్చి లచ్చయ్య ఢీకొనగా తల వెనుక భాగంలో తీవ్ర రక్త స్రావంతో కూడిన గాయాలు అయ్యాయి. వెంటనే కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యుడు పరీక్షించి లచ్చయ్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుని మేనల్లుడు గాజుల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్గటూర్ మండల ఎస్సై కొక్కుల శ్వేత తెలిపారు.