December 3, 2024
News Telangana
Image default
Crime NewsTelangana

పదోవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య


సూర్యాపేట జిల్లా బ్యూరో న్యూస్ తెలంగాణ ఫిబ్రవరి 18/సూర్యాపేట మండలం ఇమ్మంపేట వద్ద గల ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో మరో విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. ఇటీవలనే అదే గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం బైపిసి చదువుతున్న విద్యార్థిని డి వైష్ణవి పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగిన సాయంత్రమే ఉరివేసుకొని మరణించింది ఈ విషయమై మృతురాలి బంధువులు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు రాస్తారోకో ధర్నాలు చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వం అధికారులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శుక్రవారం నాడు సస్పెండ్ చేశారు. ఆ సంఘటన మరువకముందే ముందే తాజాగా అదే గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సూర్యపేట జిల్లా మోతే మండలం బురకచర్ల గ్రామ పరిధికి చెందిన ఇరుగు ఆనంద్ జ్యోతిల కుమార్తె ఇరుగు అస్మిత (15) శనివారం ఉరివేసుకొని మరణించింది. ఈనెల 10న ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మృతి చెందడంతో విద్యార్థులు భయపడకుండా ఉండటానికి పాఠశాల కళాశాలకు నాలుగు రోజులు ( హోం సిక్ )సెలవులు ప్రకటించారు. దీంతో అస్మిత కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాదు కు వెళ్లారు అస్మిత సెలవులకు హైదరాబాద్ కు వెళ్ళింది. శనివారంతో సెలవులు అయి పోతున్నందున పాఠశాలకు వెళ్లామని చెప్పిన అస్మిత తల్లి తన పనులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి అస్మిత ఇంట్లోనే ఫ్యాన్ కు సున్నితో ఉరివేసుకుంది. పాఠశాలకు వెళ్లాల్సిన రోజే అస్మిత ఉరి వేసుకోవడం మిస్టరీగా మారింది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

0Shares

Related posts

మానవత్వాన్ని చాటుకున్న అవునూర్ గ్రామస్తులు

News Telangana

కోదాడ జూనియర్ సివిల్ కోర్టు లో అగ్ని ప్రమాదం..కాలి బూడిదైనా ఫైల్స్

News Telangana

వసూళ్ల కు అడ్డా … వాంకిడి చెక్ పోస్ట్

News Telangana

Leave a Comment