ఎండపల్లి,మార్చి 02 (న్యూస్ తెలంగాణ):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామానికి చెందిన ముక్తి కవిత గురుకుల పోటి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి టీ.జి.టీ తెలుగు ఉద్యోగానికి ఎంపికయ్యారు.అక్క రజిత, తల్లి శాంతవ్వ, తండి మల్లయ్య మద్య తరగతి కుటుంబానికి చెందిన వారు, రైతు కూలి పనిచేస్తూ చదివించారు. 10 వ తరగతి వరకు జెడ్ పి హెచ్ ఎస్ పాతగూడూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. అప్పటి రోజుల్లో ఇంటర్ కళాశాల పరిసర ప్రాంతాల్లో లేకపోవడంతో, అక్క రజిత పోత్సాహంతో ప్రభుత్వ బాలికల కళాశాల కరీంనగర్ లో చదివారు. ముగ్గురు కూతుళ్ళు కావడంతో ఇంటర్ తర్వాత తల్లిదండ్రులు వివాహం చేసారు. తనకు చదువు మీద వున్న ఆసక్తితో భర్త జటంగుల రవి సహకారంతో ఓపెన్ యూనివర్సిటీల్లో డిగ్రీ, పీ.జి, టి.పి.టి. పూర్తి చేసారు. ఒకటవ తరగతి నుండి పీజి వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువు పూర్తి చేశారు . ఇష్టంతో కష్టపడి చదివితే ఎన్ని కష్టాలనైనా అధిగమించి – అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని కవిత నిరూపించారు.తన తండ్రి 2010 సంవత్సరంలో అనారోగ్యంతో మరణించారు. ఈ సమయంలో తన తండ్రి ఉంటే ఎంతో సంతోషించేవాడని ఆవేదనని వ్యక్తం చేశారు. తల్లికి ఉద్యోగం వచ్చినందుకు కుమారులు సాయివర్ధన్, వివేక్ వర్షన్ తన కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.
next post