October 7, 2024
News Telangana
Image default
Telangana

నేను రానుబిడ్డ ..చిలుకూరు దవాఖానకు..!

  • పేరుకే 24 గంటల ప్రభుత్వ ఆసుపత్రి…!!
  • ఖాళీ ఆసుపత్రి నిత్యం దర్శనం.. చిలుకూరులో డాక్టర్లు లేరా…?
  • చైతన్యవంతమైన మండలంలో… రోగులకు విసుకుపుట్టిస్తున్న వైద్యశాఖ అధికారులు…?
  • విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తీసుకోవటానికి భయమేలా..?
  • నియోజకవర్గ కేంద్రానికి కూత టు దూరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుస్థితి…
  • రోడ్డు ప్రమాదమైన.. ప్రసూతి వేదన అయిన నరకం అనుభవించాల్సిందేనా..?
  • ఆరోగ్య కేంద్రాన్ని నమ్ముకుంటే… ప్రాణాలకు నూకలు చెల్లుతాయి..?

( న్యూస్ తెలంగాణ )చిలుకూరు /మే 10 :-
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు గాను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. కానీ బాధితులకు మాత్రం భరోసా కల్పించాల్సింది పోయి ప్రాణాలకునూకలు చెల్లించుకునే దుస్థితి నెలకొన్నది. నియోజకవర్గంలో చైతన్యమంతమైన మండలముగా పేరుందిన చిలుకూరు. కానీ అందుబాటులో డాక్టర్లు సిబ్బంది గత కొన్ని నెలలుగా ఉండరు అనే అపఖ్యాతిని గుర్తింపుకా పొందారు. మూడు షిఫ్టుల్లో ఉద్యోగ ధర్మం నిర్వర్తించాల్సిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది డాక్టర్లు మాత్రం జాడఉండరని స్థానిక మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మహిళలకు ప్రసవ వేదన.. పాము కాటు కుక్క కాటు పురుగు మందు తాగిన తేలు కరిచిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తెలియక తీసుకువస్తే ప్రాణాలు పోవటం ఖాయంగా కనిపిస్తోంది. నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా చిలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంటుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఉదయం మధ్యాహ్నం రాత్రి సమయం ఏదైనా గాని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మాత్రం విధులకు ఎగనామం పెడుతూ సిటీలలో లగ్జరీ జీవితాలను గడుపుతూ దర్జాగా నెలనెలా జీతాలు తీసుకుంటున్నట్లు చిలుకూరు మండల ప్రజలు బాధితులు ఆరోపిస్తున్నారు. గురువారం రాత్రి స్థానిక హెచ్ పి పెట్రోల్ బంకు వద్ద హుజూర్నగర్ కోదాడ రోడ్ లో ఓ వ్యక్తి ప్రమాదానికి గురికాగా కోదాడ నుండి వచ్చిన అంబులెన్స్ స్థానికుల సహాయంతో చిలుకూరు దవాఖానకు తీసుకురాగా కనీసం ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం విశేషం. పేరుకే 24 గంటలు ఆరోగ్య సేవలు అందిస్తామని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో చిలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేటాయించి వైద్య సేవలు చేయాలి అనే ప్రభుత్వ సంకల్పానికి కొందరు డాక్టర్లు సిబ్బంది మచ్చ తెస్తున్నట్లు పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి చిలుకూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పై దృష్టి సారించి విచారణ చేసి విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చిలుకూరు మండల కేంద్రం ప్రజలు వేడుకుంటున్నారు.

0Shares

Related posts

నటి,ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత టి.సుబ్బలక్ష్మి కన్నుమూత

News Telangana

24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై సవాల్‌!

News Telangana

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు

News Telangana

Leave a Comment