July 26, 2024
News Telangana
Image default
Telangana

1500 మంది పోలీస్ అధికారుల, సిబ్బంది తో ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు

క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక కేంద్ర బలగాల పహారా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించేందుకి వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఈ రోజు సిరిసిల్ల , వేములవాడ పట్టణాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి, బందోబస్తు విధులపై అవగాహన కల్పించడం జరిగిందని,ముఖ్యం ఎన్నికల వేళ రూట్ బందోబస్తు,పోలింగ్ స్టేషన్ బందోబస్తు, పెట్రోలింగ్ పార్టీ పోలీసులు నిర్వహించాల్సిన విధులను తెలియజేయడం జరిగిందన్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఏదైనా అవంచనియా సంఘటనలు ఎదురైతే వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేయాలన్నారు.

భద్రతా ఏర్పాట్లు ఇలా…..

శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 1500 మంది జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికరితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, రూట్ మొబైల్స్ = 57 ,క్విక్ రియాక్షన్ టీమ్స్ 13 , స్ట్రయికింగ్ ఫోర్స్ 06 , స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్ 02 ,కేంద్ర,ఇతర బలగాలు, ట్రైనీ కానిస్టేబుల్స్ కూడా ఉపయోగిస్తున్నామని తెలిపారు.

జిల్లా లోని పోలింగ్ కేంద్రాల వివరాలు:

1.మొత్తం పోలింగ్ ప్రాంతాలు :318
2.పోలింగ్ కేంద్రాలు :560
3.క్రిటికల్ ప్రాంతాలు :48
4.క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు :58

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి స్వాధీన పరుచుకున్న వివరాలు :

1.ఇప్పటివరకు స్వాధీనపరచుకున్న నగదు 82,11,362/- రూపాయలు.

  1. లిక్కర్ లీటర్ల లో 1664.93 సుమారుగా అంచనా విలువ 10,20,222 /-రూపాయలు.
    3.గంజాయీ 16 కేసులు నమోదు చేసి, 9 కిలోల 209 గ్రాముల గంజాయి
    4.జిల్లాలో ఇప్పటివరకు 446 కేసులలో 1078 మందిని బైండోవర్ చేయడం జరిగింది.
    5.82 NBW ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది.
    6.ఎన్నికల నియమావళి ఉల్లంఘనాలపై 16 నమోదు కావడం జరిగింది.
    7.జిల్లా లో ఉన్న మొత్తం 23 ఆయుధములు డిపాజిట్ కాబడినవి.ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన వారు స్థానికంగా ఎవరు ఉందరాదని, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, హోటళ్ళలో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు, రాజకీయ పార్టీల వారు ఉండకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
0Shares

Related posts

బాలీవుడ్ నటి పూనమ్ పాండే కనుమూత

News Telangana

రేపు వారందరికీ సెలవు ప్రకటించిన సిఈవో వికాస్ రాజ్

News Telangana

బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్❓️

News Telangana

Leave a Comment