News Telangana :- సంచలన మోడల్, వివాదాస్పద నటి పూనమ్ పాండే కనుమూశారు. ఆమె వయసు 32. గత కొంత కాలంగా ఆమె గర్భాశయ క్యాన్సర్ తో చికిత్స పొందుతున్నారు. చివరి దశలో తెలుసుకున్న పూనమ్ తన మకాం ను ముంబై నుంచి కాన్పూర్ లో తన ఇంటికి చేరుకుని కొన్నాళ్ళుగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది! అర్ధరాత్రి చనిపోయినట్లు ఆమె మేనేజర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు.
అనేక బ్రాండ్స్ కు మోడలింగ్ చేసి మోడల్ గా క్లిక్ అయిన పాండే నషా చిత్రంతో బాలివుడ్ లోకి ప్రవేశించారు. పది సినిమాల వరకు చేసినా బ్రేక్ రాలేదు! కానీ, ఆమె స్టేట్మెంట్స్ తో ఎప్పుడు వివాదాల్లో ఉండి వార్తల్లో కనిపిస్తూ లైంలైట్ లోనే వుంటూ వచ్చింది! 2011లో భారత్ వరల్డ్ కప్ గెలిస్తే దుస్తులు విప్పేస్తా అని ఇచ్చిన ప్రకటన అప్పట్లో పెను సంచలనం రేపింది! 2015 లో కోల్ కతా నైట్ రైడర్స్ ట్వంటి – ట్వంటి పొట్టి కప్ గెలవగానే న్యూడ్ గా పోజిచ్చి యువతలో భూకంపం సృష్టించింది. ముంబై పేజ్ త్రీ సెలబ్రిటీ గా పబ్బుల్లో మెరుస్తూ పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తూ బాలీవుడ్ లో రాని అవకాశాల ఫ్రస్ట్రేషన్లో అనవసరంగా రచ్చ చేస్తూ ఎప్పుడూ వివాదాల్లోనే వుండింది! గర్భాశయ క్యాన్సర్ ను తొలి దశలో గుర్తించకపోవడం, కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడం చివరి దశలో ముంబై నుంచి కాన్పూర్ వెళ్ళింది. అక్కడే కనుమూసింది. సంచలనాలకు కేంద్ర బిందువు గా ఉన్న పూనమ్ పాండే ఇలా అర్ధాంతరంగా చిన్న వయసులో చనిపోవడం విచారకరం, దురదృష్టకరం. నివాళి.