మద్దూరు నవంబర్29(న్యూస్ తెలంగాణ) : మద్దూరు మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ డెలివరీ సిబ్బంది గ్రామాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ వినియోగదారుల వద్ద ముక్కు పిండి అదనంగా డబ్బు వసూళ్లు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.పదీ కీలో మీటర్ల దూరంలో ఎటువంటి అదనపు వసూళ్లు చేయొద్దని గ్యాస్ యాజమాన్యం సూచనలు చేసిన గ్రామాల్లో చదువురాని మహిళలను,రైతులను డెలివరీ సిబ్బంది ఇలా మోసం చేస్తున్నా పై అదికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.బుదవారం లాధ్ముర్ గ్రామంలో ఓ వినియోగదారుడు గ్యాస్ బుక్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ వినియోగదారునికి డెలివరీ అబ్బాయి ఫోన్ చేసి మిరు గ్యాస్ తీసుకుంటారా ఆని అడిగి ఇంటికి వచ్చిధర 966, ఉండగా 1000 రూపాయలు తీసుకొని వెళ్లిపోయిన తర్వాత తిరిగి ఎక్కవ డబ్బులు తీసుకున్నవని ఫోన్ చెసి అడిగితే మేము ఇంటికి తీసుకొచ్చి ఇస్తే ఇట్లనె వసూలు చేస్తాం ఇంకా మీ దగ్గర తక్కువ వసులు చేశానని అన్నడాని చెప్పారు.తక్షణమే మద్దూరు ఇండియన్ గ్యాస్ యాజమాన్యం పై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.