బి ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కంది మల్లేష్ వంగ లక్ష్మీనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం
నస్రుల్లాబాద్, నవంబర్ 28( న్యూస్ తెలంగాణ) : నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారము ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపు కొరకు గల్లి గల్లి ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు పోచమ్మ గల్లి లో వెలసిన పోచమ్మ అమ్మవారికి భక్తి శబ్దాలతో పోచారం శ్రీనివాస్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని బి ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు కంది మల్లేష్ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు వంగ లక్ష్మీనారాయణ గౌడ్ ఈనెల 30 జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు బాన్సువాడ నియోజకవర్గం నుండి అభ్యర్థి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలవాలని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో నుండి భారీ మెజార్టీ రావాలని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసినారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు వంగ లక్ష్మీనారాయణ గౌడ్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు భారీగా ప్రచారం లో పాల్గొన్నారు.