– పబ్లిక్ గానే వసూళ్లు
– రిజిస్ట్రేషన్ శాఖ – రోత పుట్టిస్తున్న శాఖ
– ముక్కు పిండి వసూలు చేస్తున్న వైనం.
– తిలాపాపం తలా పిడికెడు – అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు
– వసూళ్లకు అడ్డగా మారిన బాలనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం
– అక్రమ వసూళ్లకు అడ్డాగా పనిచేస్తున్న సబ్ రిజిస్టార్
న్యూస్ తెలంగాణ ఎడిటర్ ప్రత్యేక కథనం : – రిజిస్ట్రేషన్ శాఖ రోత పుట్టించే శాఖగా తయారైంది. కవితకు కాదేది అనర్హం అని మహాకవి చెప్పినట్టుగా ఆ శాఖ అధికారులు బరితెగించేశారు. వివరాల్లోకెళ్తే బాలనగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయం వసూళ్లకు అడ్డాగా మారింది. అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు తిలా పాపం తలా పిడికెడు అనేలా వ్యవహరిస్తున్నారు. సూటు బూటు వేసుకునే వారికి ఒక రేటు, పంచ కట్టు అమాయకులకు ఒక రెటు లా వ్యవహరిస్తున్నారు. సూటు బూటు వేసుకొని ఎవరైనా కార్యాలయానికి వస్తే ఆ కార్యాలయశాఖ సిబ్బంది చేసే మర్యాదలు చూస్తే మతి పోవాల్సిందే. అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన బాలనగర్ సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం అక్రమవసూళ్ళే ద్యేయంగా పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ కాసుల కోసమే రాబందుల ఎదురుచూస్తున్న సిబ్బంది కార్యాలయం మాటున దుకాణాలు కలుసొస్తున్న ఆన్ లైన్ లొసుగులు వివాద్ధం ఉంటే ఓ రేటు. లేకుంటే మరో రేటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలనగర్ కేంద్రంగా నిలువు దోపిడీ సబ్ రిజిస్టర్ పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే మరి తప్పవు తిప్పలు భారీగా చేతి వాటం చూపిస్తున్న కార్యాలయం సిబ్బంది తూతూ మంత్రంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ అక్రమ వసుల్లె ధ్యేయంగా పనిచేస్తూన్న సబ్ రిజిస్ట్రారు కార్యాలయం అమాయక ప్రజలు ఎవరైనా వున్న 100 గజాలు 200 గజాలు స్థలాన్ని వ్యవస్థలో అత్యంత పటిష్టమైన స్థిరాస్తి భద్రత కోసం ఏర్పాటు చేయబడిన విధానం రిజిస్ట్రేషన్ విధానం. ఈ రిజిస్ట్రేషన్ విధానంలో ఓ వ్యక్తి తనకంటూ సొంత అస్తిని ప్రభుత్వ రాజముద్రతో సగర్వంగా తనదంటూ చెప్పుకునేందుకు అన్ని విధాల ఇబ్బందులా చదువులేని వారు వస్తే చాలు. ఇది లేదు అది లేదు అంటూ చిరాకు పడుతుంటారు వసూళ్లు ముడుపులు చెల్లించినట్లయితే ఒకలాగా లేని చో మరోలాగా అది ఏమి తెలవని అభాగ్యులు వారి చెప్పే ప్రాసెస్ తెలవదు అంటు మబ్బు గా చూసి అయ్యా మీరు ఏం అయినా చేయండి అన్నది మొదలు ప్రభుత్వానికి సంబంధించిన పలు పన్నులు చెల్లించినప్పటికీ డాక్యుమెంట్ చార్జెస్ అని అది తక్కువ అయింది ఇది తక్కువ అయింది అని ముచ్చేమటలు పెట్టిస్తారు. నిస్సహాయత లో వున్న ఆ బాధితులు తప్పక కార్యాలయ సిబ్బందికి సైతం ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి. అదే ఎవరైనా వెంచర్ యజమాని వస్తే మాత్రం గంటలు గంటలు గా కూర్చో పెట్టుకొని పనులు చక చక చేసి తనదేనంటూ చేసి పంపుతారు రాజ్యాంగంలో అందరూ సమానులే అని మరి ఇంకెప్పుడు గుర్తుంచుతారో అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ? రిజిస్ట్రేషన్ శాఖకి రోత పుట్టిస్తున్నారని, ప్రభుత్వానికి తలంపులు తెచ్చేలా ఈ బాలనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వసూళ్లు దందా ఉందని పలువురు పేర్కొంటున్నారు.*( పూర్తి ఆదారాలతో “న్యూస్ తెలంగాణ దినపత్రిక” లో వరుస సంచలనాత్మక కథనాలు )*