September 8, 2024
News Telangana
Image default
Telangana

రైతుల సంక్షేమం సరే..? మోతే రాఘవాపురం రైతుల వెతల సంగతేంటి..?

  • భూమి పంచాయతీల్లో ఘర్షణకు పాల్పడకుండా పెద్దమనుషుల సమక్షంలో పరిష్కారం అంటూ ప్రభుత్వం సలహాలు …?
  • ఆత్మహత్యలు వద్దంటున్నా ప్రభుత్వం…?
  • కంకర మిల్లు వ్యవహారంలో యజమాని వేధింపులు..?
  • పట్టించుకోని మండల స్థాయి అధికారులు..?
  • ఇక ఆ రైతులకు దిక్కెవరు…?
  • కోదాడ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన రైతులు బాధలు తీరేదారే దొరకపాయ..?
  • ఈసారైనా రాఘవాపురం రైతులకు న్యాయం దక్కేనా…?
  • బాధితులకు ఎర…?
  • న్యూస్ తెలంగాణ కథనాలపై ఆరా…?
  • అసలు భూమి లేని వాళ్ళతో స్టేట్మెంట్లపై బాధిత రైతుల కన్నెర్ర..?

స్టేట్ బ్యూరో ప్రత్యేక కథనం /న్యూస్ తెలంగాణ, జులై 23 :-
సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామ రెవెన్యూ సర్వే 159, 161 లో ప్రభుత్వ లీజు పొందిన వంగాలకిరణ్ గౌడ్ దౌర్జన్యాల పర్వం వేధింపుల పరంపర కొనసాగుతుందని గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి పక్కన దర్జాగా బ్లాస్టింగ్లకు పాల్పడుతూ ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయకుండా దర్జాగా వ్యాపారం నిర్వహించుకుంటూ గత కొన్నేళ్లుగా కంకర మిల్లు వ్యాపారం అధికారుల కనుసైగలతో నిర్వహించుకుంటూ కోట్లాది రూపాయలు మేరా ఆధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ నిబంధనలు తో పాటు సాగు చేసుకుంటున్నా రైతుల భూముల్లో జోక్యం చేసుకుంటూ పంచాయతీల పరంపరను కొనసాగిస్తూ ఉండగా మరోవైపు అక్రమ బ్లాస్టింగ్లతో పంట చేలు ధ్వంసం అవుతున్న గాని గత రెండు సంవత్సరాల నుండి ఫిర్యాదులు చేస్తున్న గాని సంబంధిత జిల్లా మండల స్థాయి అధికారులు అంతగా పట్టించుకోలేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లీజు పొందిన వ్యక్తులు గత కొంతకాలంగా ప్రైవేటు భూములు పై కన్నేసి కొనుగోలు చేసిన గాని వ్యాపారాన్ని విస్తరించాలనే ఆకాంక్షతో క్వారీ పక్కన ఉన్న భూములు పై కన్నేసి రైతులను ఇబ్బందులు పాలు చేసి వ్యవసాయం చేసుకోకుండా ఆటంకాలు సృష్టిస్తూ భూములు అమ్మకాలు చేస్తారా లేదా లీజుకి ఇస్తారా.? అంటూ తన క్వారీలో పనిచేసే సిబ్బందిని ఉసిగొలిపి క్వారీపక్కన ఉన్న రైతుల భూములపై దౌర్జన్యం చేసి పలు అక్రమ కేసులను సైతం పెట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వారీతో సంబంధం లేని వ్యాపారాలు నిర్వహించుకునే వ్యక్తులను ఉసిగొలిపి సదరు యజమాని చేసే అరాచకాలను కప్పుపుచ్చుకునేందుకు గాను తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ రైతులను ఆగం మాగం చేస్తున్నట్లు బాధిత రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సాక్షాత్తు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి బాధిత రైతులు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఆమేరకు ఆమె స్పందించినప్పటికీ మండల స్థాయి అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేసి రైతులకు న్యాయం చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అప్పుడప్పుడు క్వారీకి వచ్చే యజమాని గత కొంతకాలంగా రాకపోకలు జోరుగా సాగిస్తూ రైతులపై ఉసుగల్పుతూ అక్రమంగా వేధిస్తున్నట్లు పలువురు రైతులు అంటున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం చాకిరాలకు చెందినయేసు అక్రమ క్వారీ వ్యవహారంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారునికి తెలియకుండా విచారణ పూర్తి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా మంగళవారం కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డిఓ వ్యవసాయ అధికారులు మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వస్తారని భావించి రైతులు పొలాల వద్ద పడికాపులు కాశారు. కాగా కొందరు జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు ఇది మామూలు విషయమే అన్నట్లుగా వ్యవహరించడం విశేషం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాఘవపురం రైతులను ఆదుకోవాలని పలువురు సూర్యాపేటజిల్లా వాసులు మోతే మండల రైతులు కోరుతున్నారు.

  • రాఘవాపురంలో కొనసాగుతున్న హైడ్రామా…?

లోకాయుక్త విచారణ దరఖాస్తు దారుడైన యేసు అనే వ్యక్తికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేశారని లోకాయుక్త విచారణ అధికారిపై ఫిర్యాదు దారుడు జిల్లా రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు చేసినట్లు దరఖాస్తు దారుడు అంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రాఘవాపురం రైతుల ఫిర్యాదులపై విచారణ చేసేందుకు బుధవారం ఆర్డిఓ వ్యవసాయ అధికారులు వస్తున్నారని విచారణకు హాజరుకావాలని మోతే తాహ తనకు సమాచారం ఇచ్చినట్లు న్యూస్ తెలంగాణ ప్రతినిధితో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన వారం రోజులు నోటీసులు పొందిన వారం తర్వాత విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఆగమేఘాల మీద రెవెన్యూ అధికారులు విచారణ పేరుతో పిలుస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిన రాఘవాపురం రైతుల బాధలపై న్యూస్ తెలంగాణ వరుస కథనాలకు జిల్లా రైతులు ప్రజలు అధికారులు స్వాగతిస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుండి రైతులు పడుతున్న వేదనలపై సమగ్ర సమాచారంతో న్యూస్ తెలంగాణ కథనాలకు అనూహ్యస్వందన వచ్చింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల పడుతున్న వేదనకు ముగింపు పలికి రైతులను వేధిస్తున్న క్వారీ యజమానిపై చర్యలు తీసుకోవాలని రాఘవాపురం రైతులు కోరుతున్నారు.

0Shares

Related posts

తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్ట్ నేత జగన్ పేరిట లేఖ విడుదల

News Telangana

సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

News Telangana

ఇక నుంచి TS కాదు TG.. రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..!

News Telangana

Leave a Comment