- గుంతలమయంగా వెల్జిపూర్ -రహీంఖాన్ పేట రోడ్డు
- రోడ్లు గుంతలు పడ్డ ఎవరు పట్టించుకోరు..
- మా బాధ ఎవరికి చెప్పుకోవాలే అంటూ వాహనదారులు ఆవేదన
- ఆర్ అండ్ అధికారుల తీరు మారదు
ఇల్లంతకుంట //న్యూస్ తెలంగాణ :- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జిపూర్ – రహీంఖాన్ పేట రోడ్డు గుంతలు పడి, కంకర తేలి అద్వాన్నంగా మారింది. రోడ్డుపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రోజులుగా రోడ్డు మరమ్మతులు మొదటి దశలోనే ఉండడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడదామని మండిపడ్డారు.ప్రతి చిన్న విషయానికి వెల్జిపూర్ గ్రామ ప్రజలు రహీంఖాన్ పేట గుండా మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గఇల్లంతకుంట మండల పలు ప్రాంతాల ప్రజలు ఈదారి గుండా రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లుటకు వెల్జిపూర్, రహింఖాన్ పెట్ గ్రామ మీదుగా దగ్గరలో (15 కిలో మీటర్ల) ఉంటుందని ప్రజలు ఈ దారినే ప్రయాణం చేస్తున్నారు .రహింఖాన్ పెట్ – వెల్జిపూర్ వరకు ఉన్న దాదాపు నాలుగు కిలో మీటర్ల రోడ్డుపై ప్రయాణం నరక ప్రాయంగా మారింది.వెల్జిపూర్, ఓబుళాపురం గ్రామంలో ప్రాజెక్ట్ కోసం రహింఖాన్ పెట్-వెల్జిపూర్ రోడ్డు మీదుగా పలు కంపెనీల బారి వాహనాలు నడపడం వల్ల ఈ రోడ్డు పరిస్థితి ఏర్పడిందని ప్రజలు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్లు గుంతలు పడ్డ ఎవరు పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .గత రెండు సంవత్సరాలు నుండి మా బాధ ఎవరికి చెప్పుకోవాలేక పోతున్నామని అన్నారు. లీడర్లు పాలకులు వాల్ల తీరు మారరని మండిపడ్డారు.కేవలం ఓట్లు కావాలని వస్తారు. సమస్యలు పరిష్కరించమంటే కనిపించరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా తీరు కూడా మారడం లేదని వాపోయారు. వర్షం పడితే రోడ్లు మాకు నరకం చూపిస్తున్నాయని ప్రాణనష్టం జరుగకముందే ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు. గ్రామ ప్రజలు కోరుతున్నారు .