- అక్రమ కేసులను వెంటనే తొలగించాలి
- అట్రాసిటీ కేసు కింద నమోదు అయిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలి
- కొండమీద శ్రీనివాస్ ధర్మ సమాజ పార్టీ జిల్లా కన్వీనర్
న్యూస్ తెలంగాణ, సూర్యాపేట జిల్లా, అక్టోబర్ 20: బేతవోలు గ్రామంలో దసరా పండుగ రోజు కనకదుర్గమ్మ గుడి దగ్గర దళితులపై జరిగిన దాడులను ఖండిస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ కొండమీద శ్రీనివాస్ అన్నారు.అధికార పార్టీ అండతో దళితుల పైన అక్రమ కేసులను బనయించడం సరైనది కాదనిఅన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా పండుగ రోజు కనకదుర్గమ్మ గుడిలో ఉద్దేశపూర్వకంగా దళితులు, అమాయకులపై దాడులు చేసి పైగా పోలీసు వారితో కేసులు పెట్టించడం సరైనది కాదని, రౌడీ షీటర్,పలు కేసులలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వట్టికూటి నాగయ్య అతని అనుచరులు దళితులను కనకదుర్గమ్మ గుడిలో దర్శనానికి వెళ్ళనీయకుండా అడ్డగించి కులం పేరుతో దూషించి,గుడి పక్కన ఉన్న పైపులతోను కర్రలతో ఇష్టానుసారంగా కొట్టినారు.చిలుకూరు మండలం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, మఫ్టీ డ్రెస్ లో ఉన్న కోదాడ పట్టణ సీఐ రాము మరియు వట్టికూటి నాగయ్య అతని అనుచరులు సుమారు 40 మందిపైగా ఉన్న వారితో కలిసి దళిత పిల్లలపై మరియు కానిస్టేబుల్ వరకుమార్ కుటుంబం పైన అందున మహిళలు అని చూడకుండా ఇస్టానుసారంగా భూతు మాటలు తిడుతూ కొట్టడం జరిగిందని,అతి తక్కువ మంది ఉన్నా సుమారు ఐదు,ఆరు మంది దళితులపైన పోలీసు వారు మరియు వట్టికూటి నాగయ్య, అతని అనుచరులు కులం పేరుతో దూషిస్తూ కొట్టడం దారుణమని, గతంలోనూ వట్టికూటి నాగయ్య మొదటి నుంచే నేర స్వభావం ఉన్న వ్యక్తి. గతంలో ఆయన దళితుల పైన దాడులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయని, ప్రస్తుత దళితుల పైన, కానిస్టేబుల్ వరకుమార్ కుటుంబం పైన దాడులు చేసి పైగా కేసులు పెట్టి జైలుకు పంపించడం అన్యాయమని, ఈ విషయంలో డి.ఎస్.పి చొరవ తీసుకొని న్యాయ విచారణ జరిపించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భాస్కర్, నుండి కత్తి అంబేద్కర్ అక్రమ కేసు బాధిత తల్లిదండ్రులైన రెమిడాల పిచ్చమ్మ, రెమిడాల బాబు, రెమిడాల పద్మ, రేమిడాల వెంకటి, నెమ్మాది మేరమ్మ,నెమ్మాది యేసు, వంగూరి రమేష్, రెడపంగు వీరయ్య, రేమిడాల బిక్షం, నెమ్మాది రవి, రాంపంగ కోటయ్య రెమిడాల కోటయ్య, రెమిడాలకోటమ్మ, గుండెపంగు రమణ బేతవోలు గ్రామ దళితులు తదితరులు పాల్గొన్నారు.