ఎలాంటి సమాచారం ఇవ్వక, అభ్యర్థి ఫ్లెక్సీలు తొలగించారని ధర్నా
సిరిసిల్లలో కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం సహకరిస్తుంది
కేటీఆర్ కు ఓ న్యాయం,మాకు న్యాయమా
కేటీఆర్ కు సుమారు 400 ఫ్లెక్సీల అనుమతి
పత్తిపాక సురేష్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు
రాజన్న సిరిసిల్ల జిల్లా/న్యూస్ తెలంగాణ సిరిసిల్లలో కేంద్రా ఎన్నికల సంఘం సహకరిస్తుందని ఏఐఎఫ్ బి ఎమ్మెల్యే అభ్యర్థి పత్తిపాక సురేష్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోఉద్రిక్తత నెలకొంది.సిరిసిల్ల మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రతిపాక సురేష్ ఫ్లెక్సీలను తొలగించారని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. ఎలక్షన్ కమిషన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ధర్నాను విరమించుకోవాలని ప్రయత్నాలు చేశారు. పోలీసు అధికారులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎ. ఐ. ఎఫ్. బి అభ్యర్థి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ. సిరిసిల్లలో కేంద్ర ఎన్నికల సంఘం కేటీఆర్ కు అన్ని విధాలా సహకరిస్తుందని, ఆరోపించారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలు తొలగించారని మండిపడ్డారు. మాకేమో రెండు రోజులకి 5 ఫ్లెక్సీలు అనుమతి ఇవ్వగా,సిరిసిల్ల లో ఊరుపోడువున కేటీఆర్ కు సుమారు 400 ఫ్లెక్సీలకు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చరవాణిలో మున్సిపల్ కమిషనర్ కు, ఆర్డీవోను అడగగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ మాటలు దాటు వేశారని వాపోయారు. ఒక అభ్యర్థి అయిన కేటీఆర్ కు ఇన్ని ఫ్లెక్సీ లకు అనుమతి ఇవ్వడం పై మండిపడ్డారు. సామాన్యులకు ఒక న్యాయం కేటీఆర్ కు న్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.సిరిసిల్లలో కేటీఆర్ పూర్తి వ్యతిరేకత మొదలైందని అన్నారు. ఎన్నికలు ఆయనకు చివరి ఎన్నికలుగా మిగులుతాయని సురేష్ హెచ్చరించారు.