ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో డిసెంబర్ 14 (న్యూస్ తెలంగాణ)
దేశ అత్యున్నత భవనం పార్లమెంట్ భవనంపై నిన్న జరిగిన పొగబాంబులదాడి హేయమైన చర్యగా అభివర్ణించారు దేశ సార్వభౌమాధికార భవనంపైనే దాడి జరిగితే కేంద్రం చేతగాని తనంగా తెలిసిందంటూ ఇలాంటి పటిష్ట భద్రత ఉన్న చోటే దాడి జరిగితే దేశ సామాన్య ప్రజల భద్రతపై అనుమానాలు వ్యక్తంచేశారు… రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రదర్శించే ఆస్కారం లేకపోలేదన్నారు.. గత ఎన్నికల నేపథ్యంలో ఎంతోమంది సైనికుల ప్రాణాలకు పణంగా పెట్టి పుల్వామా ఘటనను కేంద్రం ఎన్నికల ప్రచారంగా వాడుకున్నట్టు తెలిపారు. మళ్ళీ ఇలాంటి ఘటనతోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేకపోలేదన్నారు.. ఇలాంటి సంఘటనలు దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు సరైన సమయంలొ కేంద్ర ప్రభుత్వానికి సరైన సమాధానం ఇస్తారని తెలిపారు. భూక్య సురేష్ నాయక్ పాలేరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్