September 8, 2024
News Telangana
Image default
Life StyleTelangana

సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి లభించిన చట్టబద్ధత

హైదరాబాద్ డిసెంబర్ 19 ( News Telangana ) : ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.

ఇటీవలే ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే తాజా గా,సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి చట్టబద్ధత లభించింది.

కేంద్ర విశ్వ విద్యాలయాల చట్టం-2009లో తెలంగాణ లోని ములుగులో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యా లయం పేరును చేరుస్తూ విద్యాశాఖ ప్రవేశపెట్టిన సవరణ బిల్లును ఈ నెల 7వ తేదీన లోక్‌సభ 13వ తేదీ న రాజ్యసభ ఆమోదిం చాయి.

దాంతో ఆ బిల్లుకు నిన్న‌టి రోజున రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు దీంతో ఈ బిల్లు అది చట్టరూపం దాల్చింది ఈ మేరకు న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం-2014 లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ విశ్వ విద్యాలయాన్ని ఏర్పా టు చేస్తున్న విషయం తెలి సిందే. ఏడేళ్లలో రెండు దశల్లో రూ.889.07 కోట్లు ఖర్చు చేయనుంది.

ఈ మొత్తాన్ని కేంద్ర విద్యా శాఖ బడ్జెట్‌ రూపంలో అం దించనున్నట్లుతెలుస్తుంది.

0Shares

Related posts

కామారెడ్డి ఆరో రౌండ్.. రేవంత్ ముందంజ

News Telangana

కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించండి – కందాళ

News Telangana

మద్యం మాఫియా ..! విచ్చలవిడి

News Telangana

Leave a Comment