October 18, 2024
News Telangana
Image default
National

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్లు జైలు శిక్ష

ఇస్లామాబాద్ ( News Telangana ) :-
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మరో వారం రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలనితీవ్రంగా ప్రయతిస్తున్న ఇమ్రాన్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

ఇప్పటికే అధికార రహస్య పత్రాల లీకేజీ కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహ్మూద్‌ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్‌ హస్నత్‌ మంగళవారం తీర్పు వెలువరించింది..

ఇక తాజాగా ఇమ్రాన్‌కు మరోషాక్‌ తగిలింది. తోషా ఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు బుధవారం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆయన భార్య బుస్రా బీబీకి కూడా 14 ఏళ్ల శిక్షను విధించింది.

అంతేగాక ఇద్దరూ పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు కూడా వేసింది. సుమారు రూ.1.5 బిలియన్లు జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది

0Shares

Related posts

కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా క్రౌడ్ ఫండింగ్

News Telangana

నేడు కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం

News Telangana

పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్.. దేశవ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్..?

News Telangana

Leave a Comment