July 27, 2024
News Telangana
Image default
Telangana

అధికార పక్షానికి సహకరిస్తాం..తాతా మధుసూదన్

ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం

రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పనిచేస్తాం..

కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలి..

విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్

News Telangana :- ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని, అధికార పక్షానికి పూర్తిగా సహకరిస్తామని ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..60 రోజులగా ఎన్నికల్లో అవిశ్రాంతంగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులను అభినందనలు చెప్పారు. ఖమ్మం జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కు లభించాయన్న ఆయన.. నూతనంగా ఎన్నికైన వివిధ పార్టీల శాసనసభ్యులకు కంగ్రాట్స్ చెప్పారు. ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారని, వారి నిర్ణయాన్ని గౌరవప్రదంగా స్వీకరిస్తున్నామని, కేసీఆర్ అడుగుజాడల్లో హుందాగా వ్యవహరిస్తామని తెలిపారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, 75 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో జరగని అభివృద్ధి, సంక్షేమాన్ని 9 ఏండ్లలో దార్శనికునిగా కేసీఆర్ చేసి చూపించారని పేర్కొన్నారు. కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ కొనసాగించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అధికారం ‌చేపట్టబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు. ఆ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. 9 ఏండ్ల కాలంలో జిల్లాలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధికి పెద్దపీట వేశారని రాబోయే ప్రభుత్వం సైతం జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నాయకులందరం ప్రజలతోనే ఉంటామని, వారి సంక్షేమం కోసం పాటుపడతామన్నారు.

0Shares

Related posts

మనస్థాపానికి గురై యువతి ఆత్మహత్య

News Telangana

జూన్ 26 న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్

News Telangana

24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై సవాల్‌!

News Telangana

Leave a Comment