వెల్గటూర్,డిసెంబర్ 04 (న్యూస్ తెలంగాణ):
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల శివారులోని మెగా కంపనీ సర్జిఫుల్ డిటి – 5 వద్ద ఉత్తరప్రదేశ్ కు చెందిన సుభాష్ (35) ఆదివారం రోజున మధ్యాహ్నం సమయంలో క్లినర్ పని చేస్తుండగా, ఏక్షవేటర్ బేరింగ్ నెంబర్ 270196 వోల్వో 140 వాహనం నడుపుతున్న ఆపరేటర్ దిలీప్ కుమార్ నిర్లక్ష్యంతో వాహనాన్ని వెనుకకు తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సుభాష్ ను ఢీకొట్టడంతో అతని రెండు కాళ్లకు తీవ్ర రక్తస్రావంతో కూడిన గాయాలు కాగా అతనిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తీగలగుంటపల్లి వద్ద మృతి చెందాడని మెగా కంపెనీ అడ్మిన్ బొల్లం శ్రీనివాస్ ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి సోమవారం రోజున పంచనామ నిర్వహించి. సుభాష్ మృతదేహాన్ని అతని భార్య సీమా కుమారికి అందజేసినట్లు వెల్గటూర్ ఎస్సై కొక్కుల శ్వేతా తెలిపారు.