హైదరాబాద్, డిసెంబర్ 16 :- తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండిగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీక రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాలు కూడా రూపొందించే పనిని ప్రారంభించింది. సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులపై కూడా అధికా రులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని నెలలుగా రేషన్ తీసుకోలేని కార్డులను ఉంచాలా..తీసేయాలా అనే అంశంపై కూడా అధికారుల తో చర్చించారు. అసలైన అర్హులకే కార్డు లుండేలా చర్యలు తీసు కోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. మరోవైపు.. కొత్త కార్డులకు ఎవరు అర్హులనే దానిపై కొనసాగుతున్న ఇంకా లోతుగా చర్చలు జరుప నున్నట్టు తెలుస్తోంది. సంక్షేమ పథకాలకు, రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానిస్తే.. కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలో చనలో ప్రభుత్వం ఉంది. అయిత.. కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులు గత 9 ఏళ్లుగా జారీ కాకపోవటంతో ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
next post