హైదరాబాద్, డిసెంబర్16 ( News Telangana ) :-
మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతం పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్ అండ్,టీ, ప్రాజెక్ట్ ఈఎన్సీ కి, సంచలన లేఖ రాసింది. రిపేర్‌కు అయ్యే ఖర్చు మొత్తం భరించడంతో పాటు అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని సంస్థ లేఖలో పేర్కొంది. బ్యారేజీ కుంగిన సమయంలో ప్రాజెక్ట్ ఇంజినీర్లు ఇందుకు భిన్నంగా ప్రకటన చేశారు. నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణ ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థే భరిస్తుందన్నారు.ఎన్నికల సమయంలో ఇంజినీర్లు చేసిన ప్రకటనకు ప్రస్తుతం నిర్మాణ సంస్థ చేస్తున్న ప్రకటనకు పొంతన లేక పోవడంతో మరో సారి ఈ అంశం వివాదాస్పదమవుతోంది. బ్యారేజీ కుంగిన చోట పియర్స్, పిల్లర్లకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు రూ.55.75 కోట్లు ఖర్చు అవుతుందని ఈ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని ఎల్‌అండ్‌టీ ఈ నెల 2న కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు లేఖ రాసింది. దెబ్బతిన్న బ్యాక్, పియర్స్ ను రిపేర్ చేయడానికి రూ. 500 కోట్లు వరకు ఖర్చు అవుతుందని ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. తాజాగా ఎల్‌అండ్‌టీ లేఖలో మేడిగడ్డ బ్యారేజీ పునురుద్ధరణకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిం చాలని స్పష్టం చేయడంతో మరోసారి ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కీలక నేతలు సైతం నిర్మాణ సంస్థ పున రుద్ధరణ పనులు చేపడు తుందని.. ఆందోళన చెందాల్సినపని లేదని ప్రకటించగా తాజా లేఖతో గులాబీ పార్టీ చిక్కుల్లో పడినట్లయింది.
previous post
next post