ఎండపల్లి,నవంబర్29(న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని అన్ని గ్రామాలలో బుధవారం రోజున రాత్రి ఎస్సై శ్వేత 144 సెక్షన్ అమలు చేశారు. ఈ సందర్భంగా ఆమె నలుగురు కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులను చెదరగొట్టారు. గ్రామాలలో పార్టీ నాయకులు మద్యం, డబ్బు లు పంచుతున్నట్లయితే వెంటనే పోలీసులకు తెలియపరచాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలతో పాటు కేసులు చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు సూచించారు.
previous post