సిరిసిల్ల /న్యూస్ తెలంగాణ : అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సందర్భంలో బుధవారం మద్యం దుకాణాలు బంద్ ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా మద్యం అమ్ముచున్నట్టు సమాచారం రావడంతో అధికారులు దాడులు చేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఐ ఎం ఎల్ బాటిల్ సీజ్ చేసినారు అవి మొత్తం 12 లీటర్లు మద్యం దాని విలువ మొత్తం 14000 కలదు వారిని అరెస్టు చేసి న్యాయస్థానానికి తరలిస్తున్నట్లు ముస్తఫా సిఐ గారు తెలిపారు ఎన్నికల నియమౌళి అమలులో ఉన్న సమయంలో మద్యం దుకాణాలు ఈరోజు రేపు బంద్ ఉన్నాయి కాబట్టి ఎవరూ మద్యం తరలించడం గాని అమ్మడం గాని త్రాగడం గాని చేయకూడదు దీనిపై కఠిన చర్యలు తీసుకుంటారని ముస్తఫా సిఐ సిరిసిల్ల గారు తెలిపినారు దాడులలో పాల్గొన్న అధికారులు ఎస్సైలు శేఖర్ రాజేందర్ విజేందర్ ఏ శీను నరేందర్ రూప సుజాత పాల్గొన్నారు.
next post