July 26, 2024
News Telangana
Image default
PoliticalTelangana

Seethakka : ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర

ములుగు ( News Telangana ) : ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మేడారం జాతర ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) ( Seethakka ) ప్రకటించారు. ఆదివారం నాడు సీతక్క మేడారం(Medaram)లో పర్యటించారు..

ఈ పర్యటనలో మేడారంలో త్వరలో నిర్వహించబోయే జాతరపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ….”జాతర నిర్వహణకు 75కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. వెంటనే నిధుల విడుదల చేశారు..

75కోట్లేనా అని కొంతమంది అడగొచ్చు… కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.జాతర సజావుగా జరిగేందుకు ప్రణాళిక చేశాం. పనులు శాశ్వత ప్రాతిపదికన చేస్తాం. శానిటేషన్, ట్రాఫిక్, ఆర్టీసీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలపై దృష్టి సారించాం.కేంద్రం జాతీయ హోదా ఇవ్వడంతో నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుందని ఆశిస్తున్నాం” అని మంత్రి సీతక్క తెలిపారు..

0Shares

Related posts

తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్‌..

News Telangana

అక్రమ వసూళ్ళకి అడ్డాగా మారిన కొత్తగూడెం మైనింగ్ మరియు టీఎస్ఎండిసి అధికారులు

News Telangana

రాజధాని బస్సులో పట్టుబడిన గంజాయి

News Telangana

Leave a Comment