September 16, 2024
News Telangana
Image default
Telangana

అక్రమ వసూళ్ళకి అడ్డాగా మారిన కొత్తగూడెం మైనింగ్ మరియు టీఎస్ఎండిసి అధికారులు

  • ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న మైనింగ్ మరియు టిఎస్ఎండిసి అధికారులు
  • పరిధితో పనిలేదు పరిమితితో పనిలేదు పైసా ఫేక్ తమాషా దేక్ అంటున్న కొత్తగూడెం మైనింగ్ మరియు టీఎస్ఎండిసి శాఖలు
  • లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మాయం
  • పరిధి ఒకచోట తవ్వకం ఒకచోట


ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 25 ( న్యూస్ తెలంగాణ ) :-
అక్రమ వసూళ్ళకి అడ్డగా మారిన కొత్తగూడెం మైనింగ్ మరియు టీఎస్ఎండిసి అధికారులు పరిధితో పనిలేదు పరిమితితో పనిలేదు పైసా ఫేక్ తమాషా దేక్ అంటున్న కొత్తగూడెం మైనింగ్ శాఖ టీఎస్ఎండిసి శాఖ లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మాయం పరిధి ఒకచోట తవ్వకం ఒకచోట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పినపాక చర్ల మండలాల్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇసుక రాంపులలో వాళ్ల యొక్క పరిధికి మించి జరుగుతున్నటువంటి ఇసుక తవ్వకాలపై నియంత్రణ కోల్పోయిన మైనింగ్ శాఖ అధికార లెక్కల ప్రకారం డంపింగ్ చూపించేది ఒకచోట మైనింగ్ జరుగుతున్నది ఒకచోట ఇదంతా మైనింగ్ అధికారులు మరియు టిఎస్ఎండిసి అధికారుల కనుసనల్లో జరుగుతున్నట్లు విశ్వసినియ సమాచారం టిఎస్ఎండిసి రూల్ ప్రకారం ఒక లారీకి ఎటువంటి లోడింగ్ చార్జెస్ గాని రోడ్డు డ్యామేజ్ చార్జెస్ కానీ సదరు ఇసుక ర్యాంపు ఓనరు ఆ యొక్క లారీ ఓనర్ నుండి లోడింగ్ చార్జెస్ తీసుకోకూడదు కానీ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కొక్క లారీ దగ్గరనుంచి 1500 రూపాయలు లోడింగ్ చార్జెస్ మరియు అక్కడ లారీ కాటా పెట్టినందుకు 100 రూపాయలు లారీ సీరియల్ పెట్టినందుకు మరియొక 100 రూపాయలు మరియు ప్రోక్లైన్ ఆపరేటర్ 200 నుంచి 500 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు పై యొక్క వసూళ్లు టిఎస్ఎండిసి అధికారుల కనుసన్నలో జరగడం ఆశ్చర్యకరం గత నెల రోజుల క్రితం ఒక్కొక్క ఇసుక లారీకి అదనంగా ఒక బకెట్ ఇసుక (రెండున్నర టన్నుల నుండి మూడు టన్నులు) ఒక బకెట్ టీఎస్ఎండిసి మరియు మైనింగ్ అధికారుల కనుసన్న లో ఒక్కొక్క లారీకి రెండు నుంచి ఐదు బకెట్లు ఎక్స్ట్రా పోసి లారీ ఓనర్ దగ్గర నుంచి అనధికారికంగా ఒక్కొక్క బకెట్ కి 1500 నుంచి 2000 వేలు చొప్పున వసూలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం చూసుకున్నట్లయితే ఒక్కొక్క రాంపు నుంచి రోజుకి 100 నుంచి 200 లారీలు లోడ్ అవడం గమనార్థకం ఈ ఇసుకంత ఎటు పోతుందో అధికారులకే తెలవాలి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి లక్షల రూపాయలు టిఎస్ఎండిసి మరియు మైనింగ్ అధికారుల జేబులో వేసుకుంటున్న వైనం సదరు టిఎస్ఎండిసి అధికారిని సంప్రదించగా ఒక జిల్లా అధికారి అయ్యుండి అతను చెప్పిన మాటలు ఏమిటంటే ర్యాంపులు నిర్వహిస్తున్న వాళ్లకి ఇప్పటివరకు బిల్లులు పడలేదు వాళ్ల నిర్వహణ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయి అని ఎదురు ప్రశ్నించడం గమనార్థం గుట్టలుగా అనధికారికంగా బిల్లులు లేకుండా వెళ్తున్న లారీలను పట్టించుకోకుండా వాటి వద్ద నుంచి నెల మామూలు వసూలు చేస్తున్నారు అని విశ్వసనీయ సమాచారం సామాన్యులపై బిల్లులతో వెళ్తున్న లారీలపై ఒకటన్ను అరటను ఇసుక ఎక్కువ తడివల్ల ఎక్కువ వస్తే కాటా వారిపై వేళల్లో కేసులు రాయడం ఆశ్చర్యం ఇదే విషయమై టిఎస్ఎండిసి అధికారులని సంప్రదించగా అటువంటి ఆ లారీలను ఆపే అధికారం మాకు లేదు మీరేమన్న ఉంటే రెవెన్యూ పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించండి అంటూ ఒక జిల్లా అధికారి చెప్పడం ఆశ్చర్యకరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజుకు సగటున మైనింగ్ మరియు టిఎస్ఎండిసి అధికారుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వానికి నెలకి రెండు నుంచి నాలుగు కోట్ల పైన గండి పడుతున్నది కలెక్టర్ దీనిపై దృష్టి సారించి ఇప్పటివరకు మైనింగ్ జరిగినటువంటి ఇసుక ర్యాంపుల వివరాలు అక్రమ తవ్వక వివరాలు బహిర్గతంగా తెలియపరచాలని ప్రజలు కోరుకుంటున్నారు


{త్వరలో వేచి చుడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 2}

0Shares

Related posts

రఘునాథ పాలెం లో లోకాయుక్తా అధికారి పర్యటన

News Telangana

బద్దెనపెల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో భోజనాలతో అవస్థలు

News Telangana

గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపం: మంత్రి శ్రీధర్‌బాబు

News Telangana

Leave a Comment