- ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతున్న బీఆర్ఎస్ నాయకులు
- సుమారు 6500/-నగదు పట్టుకున్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ : ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఎన్నికల నియామవళి నిబంధనలు అమల్లో ఉండగా కోడ్ కు వ్యతిరేకంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని ఓట్లకు డబ్బులు పంచుతున్న వైనం. ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామం లో బి ఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని సమాచారంతో స్థానిక బిజెపి నాయకులు వెళ్లగా బి ఆర్ ఎస్ నాయకులు సతీష్ రావు, మున్నూరు నర్సయ్య లు నక్కల సంజీవరెడ్డి ఇంటి ముందు డబ్బులు ఇస్తూ బిఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా ఓటు వేయాలని వారిని ప్రలోబా పెట్టే క్రమంలో ఓటర్ల ఇంటి వద్ద నక్కల సంజీవరెడ్డి, సతీష్ రావు అను వ్యక్తులు బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటర్లను ప్రలోభ పెట్టి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వెయ్యాలంటూ డబ్బులు పంచుతున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. స్థానిక నాయకులు క్రాంతి మాట్లాడుతూ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవుతుందని భయంతో ఓటర్లను ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి బి ఆర్ ఎస్ పార్టీ కి అనుగుణంగా ఓటు వేయాలని చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచ మందు పంచ అన్న కేటీఆర్ దొంగ చాటున డబ్బులు పంచడం ఏంటి అని ప్రశ్నించారు. ఇలాంటి దొంగ బిఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మద్దని సూచించారు. అనంతరం పట్టుకున్న 6500/-నగదు ను స్కాడ్ టీమ్ కు అందజేశారు. కాగా సతీష్ చందర్రావు, బందెల నరసయ్య లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని అన్నారు.