News Telangana :- కేంద్ర ప్రభుత్వం నిషేదించిన పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా (PFI) కార్యకలాపాలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు చేయడంలో దూకుడు పెంచింది.తనదయిన శైలిలో విచారణ సైతం చేపట్టింది.దేశంలో ఇప్పటికే పలువురిని అదుపులోకి ఎన్ఐఏ తీసుకొంది. అదుపులోకి తీసుకున్నవారిలో ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఇద్దరు తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకులు ఉన్నారని నిఘా వర్గాల ద్వారా తెలిసిన విశ్వసనీయ సమాచారం.మరొకరు ఆంధ్ర రాష్ట్రం కు చెందిన వ్యక్తిఉన్నారు.ఈ ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చి విచారణ చేపట్టింది.తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరిలో ఒకరు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం,మరొకరు నిజామాబాద్ జిల్లాలోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ ఆహద్ అలియాస్ ఎంఏ ఆహద్ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లా ఖజానగర్ కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ ఉన్నారు. ఈ ముగ్గురిని NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో చెరిచి విచారణ చేపట్టింది.PFI ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఒకేసారి తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర ప్రదేశ్,కర్ణాటక,కేరళ,తమిళనాడుతోపాటు దేశంలోని అనుమానిత వంద ప్రాంతాలను గుర్తించి దాడులు చేపట్టడం జరిగింది.పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా కేసులో ఇప్పటివరకు 17 మంది నిందితులను NIA అరెస్ట్ చేసింది. నిజామాబాద్ లో నమోదయిన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టడం జరిగింది.. 2047 లోగ భారత దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనే లక్ష్యంగా కుట్రపన్ని పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా పనిచేస్తోందని NIA స్పష్టం చేసింది. ముస్లిం యువతకు మారణాయుధాలతో ఎలా దాడులు చేయాలి, పోలిసుల నుంచి ఎలా తప్పించుకోవాలి అనే అంశాలపై PFI సంస్థ శిక్షణ ఇచ్చినట్టుగా NIA దర్యాప్తులో తేలింది.తెలుగు రాష్ట్రాల ముగ్గురితోపాటు కేరళలో పదకొండు,కర్ణాటకలో ఐదుగురు,తమిళనాడులో ఐదుగురు ని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది NIA. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరి కోసం NIA గాలింపు చేపట్టింది.
previous post