- ఎకగ్రీవంగా ఎన్నికైన క్యూ న్యూస్ జర్నలిస్ట్ తొట్ల గంగాధర్
పెగడపల్లి, డిసెంబర్ 18 (న్యూస్ తెలంగాణ):
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ పక్షాణ నూతన ప్రెస్ క్లబ్ ను ఎర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు మోటపలుకుల వెంకట్ హాజరై నియామక పత్రం అందించడం జరిగింది. గౌరవ అధ్యక్షుడిగా బండారి బీరయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తొట్ల గంగాధర్, ఉపాధ్యక్షులుగా అడేపు శ్రీనివాస్, వడ్లకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గా ఏదుల్ల రమేష్, కోశాధికారిగా చిన్నం తిరుపతి, ముఖ్య సలహాదారుడిగా ఆత్మకూరు చంద్రయ్య కార్యవర్గ సభ్యులు గురుజల తిరుపతిరెడ్డి, పోర్తి మహేష్, చెట్ల తిరుపతి, బండారి నరేష్, దీకొండ సుధాకర్, చిన్నం తిరుపతి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ… తన పై నమ్మకం ఉంచి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు తోటి పాత్రికేయ మిత్రులకు, డిజేఫ్ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు మోటపలుకుల వెంకట్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రత్నాకర్, యాదిరెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి విషయంలో ముందుండి పాత్రికేయుల సమస్యలపై పోరాడుతానని యూనియన్ మరింత బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం నూతన కార్యవర్గానికి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.