మద్దూరు నవంబర్19(న్యూస్ తెలంగాణ)
మండలంలోని రెబర్తి గ్రామానికీ చెందిన డాకూరి పాపిరెడ్డి గత ఆరునెలలుగా టి బి మాత్రలు వాడి టి బి వ్యాధిని జయించడంతో మంగళవారం గ్రామంలో నిర్వహించిన వికాస్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వైద్య సిబ్బంది ప్రత్యేక శిబిరంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి మాధవ్ జాదవ్, వైద్య సిబ్బంది డాకురి పాపిరెడ్డినీ ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.