October 5, 2024
News Telangana
Image default
Telangana

Anganwadi Jobs : 14000 అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే..!

News Telangana :- ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను కేవలం మహిళల చేత భర్తీ చేయనున్నారు. ఏడవ తరగతి, పదో తరగతి అర్హతతో జిల్లా స్థానికత గల పెళ్లి అయిన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్‌ ఉంటే.. మినీకేంద్రాల్లో మాత్రం ఒక టీచర్‌ ఉంటారు. ఇక్కడ హెల్పర్‌ ఉండరు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో అక్కడ హెల్పర్‌ పోస్టు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు అప్‌గ్రేడ్‌ వివరాలు పంపింది. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చడంతో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్ల నియామకం చేపట్టొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్‌ పాలసీతో దాదాపు రెండున్నర వేలమంది టీచర్లు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఈ క్రమంలో అన్ని రకాల్లో కలిపి నాలుగువేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే కొన్ని జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నోటిఫికేషన్లు జారీ చేసి.. భర్తీ ప్రక్రియ ప్రారంభించింది.అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.

  • వీటికి అనుగుణంగా పోస్టులను


మినీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌తో హెల్పర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, అంతకుముందే అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది.

0Shares

Related posts

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

News Telangana

సీఎం రేవంత్‌తో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ భేటీ

News Telangana

తెలంగాణ రైతులందరికీ నేటి నుండి పెట్టుబడి సహాయం: సీఎం రేవంత్ రెడ్డి

News Telangana

Leave a Comment