October 5, 2024
News Telangana
Image default
Telangana

మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగిన ఘటనపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, డిసెంబర్ 19 ( News Telangana ) :-
మేడిగడ్డ పిల్లర్ కుంగిన తెలంగాణలో తీవ్ర దుమా రం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలువురు హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ ఉన్నత న్యాయస్థా నంలో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై హైకోర్టు లో ఇవాళ విచారణ జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేశారు. మహాదేవపురం పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిల్లర్‌ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అథా రిటీకి పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర సీఎస్ కు డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి నుంచి సమాచారం తీసుకుని వివరాలు ఇవ్వా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో వివరాలు ఇవ్వాల ని, ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం

  • ఇంత అలసత్వమా?


మేడిగడ్డ బ్యారేజీ కుంగు బాటు ఘటన బాధ్యులను ఎవరినీ వదిలిపెట్టబోమని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హెచ్చ రించారు. అంత పెద్ద ప్రాజెక్టు నిర్మా ణంలో నాసిరకం పనులు ఎలా చేశారని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రాజెక్టు అధికారులు, ఇంజినీర్లతో రివ్యూ నిర్వహించిన ఆయ న.. తమకు సంబంధం లేదంటూ ఏదో ఒక లేఖ అధికారులకు ఇచ్చి తప్పిం చుకోవాలని చూస్తే ఊరుకు నేది లేదని తేల్చిచెప్పారు. ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు ల కాంట్రాక్టర్లను కూడా పిలిచి చర్చించాలని ఆదేశించారు

0Shares

Related posts

కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా క్రౌడ్ ఫండింగ్

News Telangana

నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

News Telangana

రైతుల సంక్షేమం సరే..? మోతే రాఘవాపురం రైతుల వెతల సంగతేంటి..?

News Telangana

Leave a Comment