July 26, 2024
News Telangana
Image default
PoliticalTelangana

ధరణి పోర్టల్ పై నేడు సమావేశం కానున్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్ , డిసెంబర్ 13 ( News Telangana ) :-
తెలంగాణ రెండో ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసు కున్న మొదటి రోజు నుండి వరుసగా అధికారులతో సమీక్షలు, రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్, టీఎస్పీ ఎస్సీ, రైతు బంధు అంశా లను టేకప్ చేసిన రేవంత్ రెడ్డి..తాజాగా సమస్యల నిలయంగా మారిన ధరణి పోర్టల్‌పై ఫోకస్ పెట్టారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహ్మతా జ్యోతి బాపూలే భవన్ లో నిర్వహిస్తోన్న ప్రజా దర్బార్‌ లో సైతం ఎక్కువగా ధరణి పోర్టల్‌పైనే ఫిర్యాదులు రావడంతో రేవంత్ దీనిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇవాళ మధ్నాహ్నం సచివాల యంలో ధరణి పోర్టల్‌పై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించున్నారు. ఈ సమావేశానికి రెవిన్యూ మంత్రి పొంగులేటి, సంబం ధిత శాఖ అధికారులు హాజ రుకానున్నారు. అయితే, భూముల డిజిటలైజేషన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ సమస్యల నిలయంగా మారిన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతే కాకుండా ధరణి పోర్టల్‌తో బీఆర్ఎస్ నేతలు అధి కారులతో కుమ్మక్కై అసైన్డ్ ల్యాండ్స్‌ను,ఇతర ప్రభుత్వ భూములను రాష్ట్రవ్యా ప్తంగా పెద్ద ఎత్తున కబ్జా చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి దాని స్థానంలో కొత్త విధానం తీసుకువస్తామని స్వయం గా రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అధికారంలో రావడంతో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సమ స్యల కుప్పగా మారిన ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ కమిటీ వేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌పై తదుపరి నిర్ణయం తీసు కోవాలని రేవంత్ రెడ్డి భావిస్తోన్నట్లు తెలుస్తోంది ఇక, అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించడంతో ఇవాళ్టి సమీక్షపై ఉత్కంఠ నెలకొంది. ధరణి పోర్టల్‌పై రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుం టారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

0Shares

Related posts

తుమ్మ ముల్లు కదా? బాగా గుచ్చుకుందా కెసిఆర్ ? తుమ్మల నాగేశ్వరరావు

News Telangana

అవినీతికి “కేరాఫ్‌‌” గా సూర్యాపేట రవాణా శాఖ

News Telangana

బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రాం రాం

News Telangana

Leave a Comment