హైదరాబాద్ ( News Telangana ) :- తెలంగాణలో సంచలన నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి తమదైన స్టైల్ లో మార్క్ పాలన ను కనబరు స్తున్నారు. సర్కారు కొలువుదిరిన రోజు నుంచి ఆయా శాఖల అధి కారులతో వరుసగా రివ్యూ లు నిర్వహిస్తూ..కీలక ఆదే శాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డి తన మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరాన్ని అభి వృద్ధి చేసేందుకు మీ దగ్గరు న్న ప్లాన్ ఏంటని ఓ న్యూస్ ఛానల్ యాంకర్ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానం.. సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యింది. అప్పడు ట్రోల్ అయిన తన ప్లాన్‌నే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి చూపేందుకు సిద్ధమవు తున్నారు. హైదరాబాద్ మహానగరంలో మూసి నది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికా భివృద్ధి ప్రాంతంగా రూపొం దించాలని సీఎం రేవంత్ రెడ్డి, అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవల ప్‌మెంట్ కార్పొరేషన్‌పై సమీక్షా సమావేశం నిర్వ హించారు. మొత్తం మూసీ పరీవాహక ప్రాంతాన్ని పర్యా టకులను ఆకర్షించే విధంగా స్వీయ ఆర్థిక చోదక ప్రాంతం గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు గానూ..మూసీ నదీ వెంట బ్రిడ్జిలు, కమ ర్షియల్, షాపింగ్ కాంప్లె క్సులు, అమ్యూజ్ మెంట్ పార్కులు, హాకర్ జోన్లు,పాత్-వేలను ప్రభు త్వ, ప్రైవేటు భాగ స్వా మ్యం విధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికా రులను ఆదేశించారు
previous post