September 15, 2024
News Telangana
Image default
PoliticalTelangana

రేపటినుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు

హైద‌రాబాద్ , డిసెంబర్ 13 ( News Telangana ) :-
రాష్ట్ర శాసనసభ సమా వేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే అంశాన్ని రేప‌టి బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమా చారం ప్రకారం ఈనెల 15న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.16వ తేదీన శాసనసభలో,మం డలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పెట్టి చర్చిస్తారు. 17వ తేదీన సైతం సమా వేశాలు నిర్వహించే అవకా శాలున్నాయి. కాగా, ఈనెల 10వ తేదీన కొత్తగా ఏర్పా టైన సర్కార్ అసెంబ్లీ సమా వేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్​ను ఎన్నుకుని ఆయనతో సహా 101 మంది ఎమ్మె ల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. పలు కారణాలతో మరో 18 మంది ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఆరోజు వాయిదా పడిన సమా వేశాలు తిరిగి రేపు ప్రారం భం కానున్నాయి. ఇక గురు వారం రోజున శాసనసభ స్పీకర్‌ను ఎన్ను కోనున్నారు. ఈ క్రమంలో ఇవాళ నామినేషన్లు స్వీకరిం చనున్నారు.శాసనసభా పతిగా వికారాబాద్ ఎమ్మె ల్యే గడ్డం ప్రసాద్‌ను ఎన్ను కోవాలని ఇప్పటికే కాంగ్రెస్‌ తీర్మానించింది. ఆయన ఒక్కరే నామినేషన్‌ వేస్తే ఏకగ్రీవం కానుండగా ఇంకేవరైనా వేస్తే ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. గ‌డ్డం ప్ర‌సాద్ కు బిఆర్ఎస్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.

0Shares

Related posts

అక్రమ మద్యం పట్టివేత

News Telangana

తెలంగాణలో ముగిసిన పోలింగ్‌

News Telangana

ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

News Telangana

Leave a Comment